రమేష్ బాబుకి, బాలకృష్ణ కి మధ్య ఆ విషయంలో వివాదం..? కృష్ణ ఎంట్రీ ఇచ్చేసరికి..?

రమేష్ బాబుకి, బాలకృష్ణ కి మధ్య ఆ విషయంలో వివాదం..? కృష్ణ ఎంట్రీ ఇచ్చేసరికి..?

by Megha Varna

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి నటనతో బాగా ఆకట్టుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. గతంలో ఒకసారి బాలకృష్ణ, రమేష్ బాబు కి మధ్య కాస్త గొడవ జరిగిందట. అదే సినీ కెరీర్ లో రమేష్ బాబు కి గొడవ రావడం. ఇక వీరి మధ్య అసలు ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

రమేష్ బాబు బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత యాక్టింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ట్రైనింగ్ తర్వాత ఆయన్ని గొప్పగా పరిచయం చేయాలనుకున్నారు. రమేష్ బాబు సామ్రాట్ సినిమాకి ఒకే చెప్పేసారు. ఆ సినిమాకి వి.మధుసూధనరావు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం బేతాబ్ అనే బాలీవుడ్ సినిమాకి రీమేక్. ఈ టైటిల్ కారణంగానే గొడవ వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ అప్పటికే కొన్ని సినిమాలు చూసి హీరోగా పేరు పొందారు. తన సినిమాకి సామ్రాట్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ టైటిల్ కోసం కృష్ణ ఏకంగా కోర్టుకు వెళ్లి పోరాడారు. ఆఖరికి కృష్ణకి ఈ టైటిల్ చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో బాలకృష్ణ టైటిల్ ని సాహస సామ్రాట్ కింద మార్చుకున్నారు. రమేష్ బాబు హీరోగా సామ్రాట్ 1987 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.

రమేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. అయినప్పటికీ కూడా హీరోగా రాణించలేకపోయారు రమేష్ బాబు. 1997లో చివరిగా రమేష్ బాబు ఎన్ కౌంటర్ సినిమా చేసారు.


End of Article

You may also like