Ads
దాదాపు 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్మితా సబర్వాల్ కాంగ్రెస్ అధికారంలోకి వెళ్తారు అనే వార్తలు గట్టిగా ప్రచారంలోకి వచ్చాయి.
Video Advertisement
కానీ స్మితా సబర్వాల్ అలా చేయలేదు. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో విషయాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. సాధారణంగా స్మితా సబర్వాల్ అంటే చాలా మందికి ఐఏఎస్ అధికారిగా మాత్రమే తెలుసు. కానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా స్మితా సబర్వాల్ సోషల్ మీడియా ద్వారా చెప్తూ ఉంటారు. చేనేత వస్త్రాలని ప్రమోట్ చేస్తూ ఎక్కువగా చేనేత దుస్తులనే ధరిస్తారు.
అప్పుడప్పుడు ట్రిప్స్ కి వెళ్తూ దానికి సంబంధించిన ఫోటోలని కూడా పోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే స్మితా సబర్వాల్ ఇటీవల తన 12 క్లాస్ మార్క్స్ మెమో షేర్ చేశారు. సెంట్ ఆన్స్ హైస్కూల్ హైదరాబాద్ లో స్మితా సబర్వాల్ చదువుకున్నారు. స్మితా సబర్వాల్ కి ఏ గ్రేడ్ వచ్చింది. స్మితా సబర్వాల్ మార్క్స్ చూసుకుంటే,
# ఇంగ్లీష్ – 94
# హిందీ – 94
# ఎకనామిక్స్ – 90
# స్ట్రక్చర్ ఆఫ్ కామర్స్ – 86
# ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంట్స్ – 97
మార్కులు వచ్చాయి. స్మితా సబర్వాల్ 1995 లో 12వ తరగతి చదువుకున్నారు. ఈ మార్క్స్ మెమో షేర్ చేసి స్మితా సబర్వాల్ ఈ విధంగా రాశారు.
ఈ పోస్ట్ లో స్మితా సబర్వాల్, “12 ఫెయిల్ సినిమా అనేది ఒక ఇన్స్పిరేషనల్ సినిమా. కానీ 12 పాస్ అవ్వడం అనేది ఒక తీపి జ్ఞాపకం. 12 క్లాస్ రిజల్ట్ చూసుకొని, నేను అందులో బాగా చదివాను అని గుర్తు చేసుకుంటే నాకు ఆ విషయం పెద్ద కలలు కనడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అందరికీ ఇది ప్రపంచంలోనే చాలా కఠినమైన ఎంట్రన్స్ ఎగ్జామ్. హార్డ్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ కూడా చేయండి. మనం ఏం రాస్తున్నాం, మనం ఎంత జ్ఞానం పొందాం. ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి” అని స్మితా సబర్వాల్ రాశారు. ఈ పోస్ట్ చూసిన అందరూ కూడా స్మితా సబర్వాల్ మాట్లాడిన మాటలకి మెచ్చుకుంటున్నారు.
#12thfail was an inspiration!
But 12th Pass in flying colors is a sweet memory.
Chanced upon my 12th result and recalled that doing well gives one the insane confidence to dream big!
To all the dear kids who are prepping for #UPSC🇮🇳one of the toughest entrances in the world..… pic.twitter.com/R30mQZpH5u— Smita Sabharwal (@SmitaSabharwal) February 9, 2024
End of Article