Ads
పాము పేరు వింటే ఎవరైనా పడుతూ వుంటారు. పాము ఎంత చిన్నదైనా అది కాటేస్తే మనిషి ప్రాణాలు పోతాయి. అందువల్లనే చాలా మంది పాముకు భయపడతారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అన్ని పాములు ప్రమాదం కావు. కేవలం కొన్ని పాములు మాత్రమే ప్రమాదకరమైన విషాన్ని వెదజల్లుతాయి.
Video Advertisement
అయితే పాముని చూసిన వెంటనే ముందు మనం అది ప్రమాదకరమైనదో లేదో ఆలోచించము. దాన్ని చూసిన వెంటనే ఎలా చంపాలి అనే దానినే ఆలోచిస్తూ ఉంటాము. ఇదే విధంగా ఒక మనిషి పాముని చూసి ఒక కర్ర విసిరాడు. అలా చేయడం వల్ల అతను కోట్లు ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే..
అమెరికాలో ఒక వ్యక్తి తన ఇంటిలో క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుంటున్నాడు, ఆ సమయంలో ఒక పాము వచ్చింది. దాంతో ఏం చేయాలో తోచక క్యాంప్ ఫైర్ నుండి ఒక కర్రను తీసి పాము పై విసిరాడు. దాంతో ఆ కర్ర డోర్ కర్టెన్ పై పడింది, అతని కళ్ల ముందే ఇల్లంతా మంటలు వ్యాపించాయి.
ఫైర్ సిబ్బంది వచ్చినా సరే ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇల్లు మొత్తం తగలబడిపోయింది. అందుకే నిప్పుతో చెలగాటం ఆడకూడదు అని పెద్దలు చెబుతారు. పాముని చంపబోయి ఇంటికే నిప్పంటించుకున్నాడు. ఏడున్నర కోట్ల విలువ వున్న ఇల్లు కాలిపోవడంతో కంటతడిపెట్టుకున్నాడు. నెట్టింట్లో ఫోటోలు వైరల్ గా మారాయి.
End of Article