కరెంటు బిల్లు చూసి ఆశ్చర్యపోయిన స్నేహ భర్త.! ఎంత వచ్చిందంటే?

కరెంటు బిల్లు చూసి ఆశ్చర్యపోయిన స్నేహ భర్త.! ఎంత వచ్చిందంటే?

by Megha Varna

Ads

“రాధా గోపాలం” చిత్రంతో బెస్ట్ హీరోయిన్ గా నంది అవార్డు ను అందుకున్న నటి స్నేహ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తిండిపోతారు.అయితే లాక్ డౌన్ కారణంగా విద్యుత్ బిల్లుల విషయంలో కొంచెం గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.తాజాగా స్నేహ భర్త ప్రసన్న కు దాదాపు 70 వేల రూపాయల విద్యుత్ బిల్ చెల్లించాలంటూ విద్యుత్ శాఖ తెలిపింది..ఆ వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

లాక్ డౌన్ కారణంగా చాలామంది విద్యుత్ బిల్లును ఆన్లైన్ లో జమ చేసారు.కాగా కొంతమంది ఇంకా బిల్లులను చెల్లించలేదు.అయితే ఈ గందరగోళంపై విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చింది.మూడు నెలలకు ఏవరేజ్ బిల్లును తీస్తామని ప్రతీ నెల కొంత మొత్తం కట్టాల్సి ఉంటుంది అని చెప్పింది.అయితే స్నేహ భర్త మరియు వారి మామ గారి ఇళ్లకు దాదాపు 70 వేల రూపాయలు కరెంటు బిల్ కట్టాలని విద్యుత్ శాఖ తెలిపింది.

అయితే ఈ విషయంపై స్నేహ భర్త ప్రసన్న షాక్ కు గురయ్యారు.ఎప్పుడూ వచ్చే బిల్ కంటే ఇప్పుడు దాదాపు పది రేట్లు ఎక్కువ వచ్చింది అని ప్రసన్న తెలిపారు.అయితే దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తూ..లాక్ డౌన్ కారణంగా రీడింగ్ లో తప్పు దొర్లినట్లుగా అనిపిస్తుంది.కావున మళ్ళీ ఒకసారి రీడింగ్ తీసి పరిశీలిస్తామని అని అన్నారు..


End of Article

You may also like