కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతివాళ్ళు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ప్రబుత్వాలన్నీ చెప్తూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ ఒక వినూత్న టెక్నాలజీ ని ప్రవేశపెట్టారు.ప్రతీ ఒక్కరు రోడ్ల మీద సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో అనుసంధానం

Video Advertisement

చేసిసీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకుంటారు.ఒకవేళ ఎవరైనా సామాజిక దూరం పాటించకపోతే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సదరు వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటారు.పూర్తి వివరాలలోకి వెళ్తే ..

కరోనా వైరస్ ని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించడం తప్పినిసరి.అయితే కొంతమంది మాత్రం విచక్షణారహితంగా రోడ్ల మీదకి మాస్క్లు కూడా లేకుండా వస్తున్నారు.అయితే ఇక నుంచి ఇలా బాధ్యత రహితమైన చర్యలు చేస్తే మాత్రం ముప్పు తప్పదు.ఎందుకంటే ఎక్కువగా జనం గుమిగూడిన ,ఎక్కువ రద్దీగా ఉన్న ,సామాజిక దూరం పాటించకపోయిన కంట్రోల్ రూమ్ లో ఉన్న సిబ్బంది ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ తో ఉన్న కెమెరాల సాయంతో తెలుసుకొని దగ్గరలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేస్తారు.అప్పుడు పోలీస్ లు అక్కడికి చేరుకొని సామాజిక దూరం పాటించేలా చేస్తారు.

ఈ విషయంపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా కెమెరాల సహాయంతో సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునే టెక్నాలజీ దేశంలో మొదటిసారిగా తెలంగాణ లోనే ప్రారంభం అవుతుంది అని అన్నారు.మొదటగా ఈ విధానాన్ని రాచకొండ మరియు సైబరాబాద్ ప్రాంతాలలో ప్రవేశపెడతామని తర్వాత ఈ టెక్నాలజీ హైద్రాబాదు అంత ఉపయోగిస్తామని తెలంగాణ డీజేపీ మహేందర్ రెడ్డి గారు తెలిపారు .

social distance technology in hyderabad

social distance technology in hyderabad