SOFTWARE DEVELOPER లో “హారిక” రియల్ లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా.? మల్టీ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే.!

SOFTWARE DEVELOPER లో “హారిక” రియల్ లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా.? మల్టీ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే.!

by Mohana Priya

ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన వెబ్ సిరీస్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది సాఫ్ట్ వేర్ డెవలపర్. ఈ వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే డాన్ పృథ్వీ , శ్రీ విద్య , ఝాకాస్ పృథ్వీ కూడా కీలక పాత్రలు పోషించారు.

Video Advertisement

వీళ్లందరితో పాటు మరొక ఇంపార్టెంట్ రోల్ ఉంది. తనే హారిక. హారిక గా నటించిన నటి పేరు శ్రీ ప్రియ ఈడూరి . శ్రీ ప్రియ విజయవాడ నుంచి వచ్చారు. శ్రీ ప్రియ మంచి నటి మాత్రమే కాకుండా ఫోటోగ్రాఫర్,  డాన్సర్ , ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా సింగర్ కూడా.

శ్రీ ప్రియ సోషల్ మీడియా లో తన సింగింగ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని పెనివిటి  సాంగ్ ఫిమేల్ వర్షన్ పాడి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు శ్రీ ప్రియ . ఈ పాట తమన్ దృష్టి లో పడింది. శ్రీ ప్రియ పాటని అభినందిస్తూ ట్వీట్ చేశారు తమన్ . రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా శ్రీ ప్రియ పాటని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు .

 

సుబ్బు దర్శకత్వం వహించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో హారిక పాత్రతో యాక్టింగ్ లో అడుగు పెట్టారు శ్రీ ప్రియ. డెబ్యూట్ షో అయినా కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు శ్రీ ప్రియ. శ్రీ ప్రియ ఫేవరెట్ హీరో నాని. అందుకే తన ఇంస్టాగ్రామ్ ఐడి కూడా నానీ ఫ్యాన్ గర్ల్ (nani fan girl) అని ఉంటుంది. శ్రీ ప్రియ జాబ్ చేస్తూనే సింగింగ్ , యాక్టింగ్, ఇంకా ఇతర హాబీస్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు.

watch video:

https://www.instagram.com/p/CFSRhivpdyl/

 


You may also like