Ads
సాధారణంగా చాలా మందికి ఏసీలో కూర్చొని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని చేసుకోవాలి అని ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది సాఫ్ట్ వేర్ జాబ్ రావాలి అని కోరుకుంటారు. ఇందుకోసం చాలా మంది ఎంతో కష్టపడి ప్రయత్నిస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తనకి ఉన్న సాఫ్ట్ వేర్ జాబ్, ఐదంకెల జీతం, అన్ని వదిలేసి వేరే వృత్తిని చేపట్టారు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, వి6 న్యూస్ కథనం ప్రకారం విశ్వ చైతన్య అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉండేవారు. అయితే ఆయనకి జాబ్ నచ్చలేదో, లేదా ఇంకేదైనా కారణమో తెలియదు కానీ విశ్వ చైతన్య తన జాబ్ వదిలేసి విశ్వ చైతన్య పేరుతోనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు.
అందులో ఆయన ని బాబా గా పరిచయం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోని పీఏ పల్లి మండలంలోని అజ్మా పురంలో పది ఎకరాల స్థలంలో ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారు. రోగాలు నయం చేస్తానని, హోమాలు చేస్తూ ప్రజలందరినీ నమ్మించారు. ఈ విధంగా కొన్నాళ్ల నుంచి ఇలా కొనసాగిస్తున్నారు విశ్వ చైతన్య. రోగాలు నయం చేస్తానని, హోమాలు చేస్తాను అని చెప్పి భక్తుల నుండి ఎన్నో లక్షలు వసూలు చేశారు.
ఈ విషయంపై విశ్వ చైతన్య మాటలు నమ్మిన ఒక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు విశ్వ చైతన్య ని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమం నుండి లక్షరూపాయల నగదు, కొన్ని నగలు, అలాగే కోట్ల విలువ చేసే ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
watch video :
End of Article