Ads
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ వార్తలే. టీవీలో పేపర్లలో రేడియోలో ఫోన్లో కూడా ఈ వైరస్ మన దగ్గరికి రాకుండా ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తూనే ఉన్నారు. కానీ అన్ని చోట్ల ఇలాంటి సదుపాయాలు ఉండవు. టీవీలు పేపర్లు అందుబాటులో లేని మారుమూల గ్రామాలు కూడా ఉంటాయి.
Video Advertisement
అలాంటి గ్రామ ప్రజలకు ఈ విషయాల గురించి అంతగా తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా అదేంటి?, అది వాళ్ళ దగ్గరికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల పై పూర్తి అవగాహన ఉండదు. అందుకే ఎన్జీవోలు ఇలాంటి మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రతి విషయం వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో వాళ్లు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అందుకే తన ఊరి ప్రజలకి తనే అర్థమయ్యేలా చెప్పాలని వీధి గోడలమీద పెయింటింగ్ వేసి కరోనా పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు 25ఏళ్ల ఆంధ్రప్రదేశ్ కి చెందిన సోమశేఖర్ గుడిపల్లి.
సోమశేఖర్ ది అనంతపూర్ లో ఒక ఊరు. తను ఉండే చోట నుండి 90 కిలోమీటర్లు దూరంలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీ లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఇప్పుడు కాలేజీ కూడా సెలవు కావడంతో తన ఊరి ప్రజలకి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇలా పెయింటింగ్ ల రూపంలో చెప్తున్నాడు సోమశేఖర్.
దీని గురించి సోమశేఖర్ బెటర్ ఇండియా తో మాట్లాడుతూ ” ఊర్లో ఉన్న వాళ్లందరికీ టీవీ, న్యూస్ పేపర్ లేదా ఇంటర్నెట్ సదుపాయం ఉండకపోవచ్చు. ఇలా వీధిలో పెయింటింగ్ వేస్తే దాని గురించి అందరికీ తెలుస్తుంది. సోషల్ డిస్టెన్స్ గురించి వీలైనన్ని ఊర్లలో అవగాహన కల్పించడమే నా ధ్యేయం” అని చెప్పారు.
తాను బొమ్మలు వేయడమే కాకుండా వాటి పక్క ఇలాంటి హెచ్చరిక కూడా రాస్తాడు.
తుమ్మినా దగ్గినా చేతి రుమాలు వాడండి .
కరోనా మహమ్మారిని నిర్మూలించండి
మాస్కులు ధరించండి
సామాజిక దూరం పాటించండి
పెయింటింగ్స్ వేయడానికి ముందే సోమశేఖర్ తన ఊరి పోలీస్ ఇంకా పంచాయత్ లో మాట్లాడి వారి దగ్గర అనుమతి తీసుకున్నాడు. తనకి దగ్గరలో ఉన్నాయి 50 ఊర్లలో 90 కి పైగా పెయింటింగులు వేసి తన కళని ప్రదర్శించడమే కాకుండా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం చదివే చదువు నలుగురికి ఉపయోగపడాలి అన్న దానికి సోమశేఖర్ ఒక నిదర్శనం.
End of Article