Ads
మన దేశంలో ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక ప్రపంచంలో మరెవరికీ ఉండదు అని బోలెడు సర్వేలు చెబుతున్నాయి.ఆ సర్వేలు నిజమని తాజాగా ఓ వీడియో చూసినవారంతా ఒప్పుకుంటున్నారు.
Video Advertisement
ఇంతకీ ఆ వీడియో కథేంటో ఇప్పుడు చూద్దాం.ఆంధ్రాకు చెందిన ఒక మహిళ తన అల్లుడు ఇంటికీ వస్తున్నాడని దాదాపు 67 రకాల పదార్ధాలతో విస్తరంత నింపేసింది.ఈ విందులో వెల్కమ్ డ్రింక్స్, స్టార్టర్స్,చాట్,మెయిన్ కోర్స్, డెజర్ట్స్ అన్ని ఆమె ఒక్కొక్కటి వివరించి చెప్పింది.
ఈ విందులో అత్త గారు అల్లుడి గారి కోసం ఒక స్వీట్ లో బంగారు కాయిన్ ను కూడా ఉంచారు.ఈ విందుకు సంబంధించిన వీడియోను అనంత్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు.విస్తరంత వంటకాలు నిండిపోయి ఉండడంతో మనోళ్లు వీడియోను తెగ చూస్తూ వైరల్ చేస్తున్నారు.మరికొంత మంది ఈ వీడియో పై క్రేజీ కామెంట్స్ చేస్తూ తెగ నవ్విస్తున్నారు. అల్లుడు అంత తినగలిగాడా? అంటూ కామెంట్స్ కూడా కొందరు చేసారు.
https://twitter.com/i/status/1280784332144013312
1.
2.
3.
End of Article