హాస్టళ్లలో ఉన్నవాళ్లకు స్వస్థలాలకు వెళ్లడానికి పాస్ లు …

హాస్టళ్లలో ఉన్నవాళ్లకు స్వస్థలాలకు వెళ్లడానికి పాస్ లు …

by Megha Varna

Ads

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ లో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి,హాస్టల్స్ నుంచి బయటకి వెళ్ళమని ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీంతో యువతి, యువకులు వాళ్ళ సొంత ఇంటికి వెళ్లలేక రోడ్ల మీద పడ్డారు.రైళ్లు,బస్సులు, ప్రైవేట్ వాహనాలు అన్నీ బంద్ ఉంటే ఇప్పటికిప్పుడు తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.ఈ విషయం మీద స్పందించిన తెలంగాణ ప్రభుత్వం స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించారు….మీరు మీ సొంత ఇళ్లకు వెళ్ళాలి అంటే మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి అనుమతి పత్రం(పాస్) తీసుకోవాలి అని కోరారు,దింతో పోలీసు స్టేషన్ ల వద్ద క్యూ కట్టారు. .పంజాగుట్ట, రాయదుర్గం, ఎస్‌ఆర్‌నగర్‌, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్లకు విద్యార్థులు భారీగా క్యూ కట్టారు ,,పోలీసు స్టేషన్ కి వచ్చేముందు మీరు తప్పని సరిగా హాస్టల్ కి కట్టిన బిల్స్ కానీ ఇంటి ఓనర్ అనుమతి పత్రం కానీ తీసుకొని రావాలి అని పోలీసులు తెలియజేసారు, పాసులు తీసుకున్న వాళ్ళు వెంటనే సొంతూళ్లకు చేరుకోవాలని పోలీసులు తెలియజేసారు.చెక్‌పోస్టుల వద్ద వారిని అడ్డుకోకుండా ఈ పాస్ లు మంజూరు చేసినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Video Advertisement


End of Article

You may also like