Ads
ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యల్లో చిక్కుకున్న ఎంతో మందికి సహాయం చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు సోనూసూద్. సోనూసూద్ నిజ జీవితంలో ఎంత మంచి వ్యక్తి అనే విషయం అందరికీ అర్థం అయింది. మనందరం సోనూసూద్ ని ఆన్ స్క్రీన్ లో విలన్ గా నే గుర్తు పెట్టుకున్నాం.
Video Advertisement
సోనూసూద్ విలన్ గా మనకి అంత గుర్తు ఉండడానికి కారణం ఆయన నటన. సోనూసూద్ తెలుగులో నటించిన సినిమాల్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం.
#1 కందిరీగ
అసలు కందిరీగ సినిమా చూడని వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారేమో. ఒకవేళ మీరు చూడకపోతే రేపు కానీ, ఎల్లుండి కానీ జీ తెలుగు పెట్టండి. ఎందుకంటే ఒక రోజు జీ తెలుగులో, ఒకరోజు జీ మూవీస్ లో, తర్వాత మళ్లీ జీ తెలుగులో అలా ఒక వారం లో కందిరీగ సినిమా ఎన్ని సార్లు టెలికాస్ట్ చేస్తారో జీ తెలుగు వాళ్ళకే తెలియాలి. ఈ సినిమాలో సోనూసూద్ మాట్లాడడానికి నత్తితో ఇబ్బంది పడే వ్యక్తిగా అటు విలనిజం చూపిస్తూనే ఇటు కామెడీ యాంగిల్ కూడా చూపించారు.
#2 అరుంధతి
ఇప్పుడు అంటే సినిమా చూసి చూసి మనకి బోర్ కొట్టేసింది కానీ. సినిమా రిలీజ్ అయినప్పుడు పశుపతి క్యారెక్టర్ కి భయపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారేమో.
#3 అతడు
విలన్ అంటే ఇలా సాఫ్ట్ గా కూడా మాట్లాడుతారు అని చూపించిన సినిమాల్లో అతడు ఒకటి. సోనూసూద్ కూడా తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
#4 దూకుడు
అప్పటి వరకు మనం యంగ్ గా ఉన్న సోనూసూద్ ని మాత్రమే చూశాం. అరుంధతి సినిమాలో ఎన్నో సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినా కూడా అఘోరా రూపంలో ఉంటారు. దూకుడు సినిమా లో మాత్రం తన వయసు కంటే కొంచెం పెద్ద పాత్రలో నటించారు సోనూసూద్.
#5 ఆంజనేయులు
ఈ సినిమాలో లో హీరో రవితేజ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సోనూసూద్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది.
#6 జులాయి
ఈ సినిమాలో మనం అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఎంతగా అయితే ఇష్టపడ్డామో విలన్ అయినా కూడా సోను సూద్ క్యారెక్టర్ ని అంతే ఇష్టపడతాము. బిట్టు ప్లేస్ లో వేరే యాక్టర్ ని ఊహించుకోవడం కష్టమే.
#7 అభినేత్రి
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం సోను సూద్ క్యారెక్టర్ పోజిటివ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ లో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో సోనూసూద్ హీరోగా, ఇంకా విలన్ గా నటించారు.
#8 ఏక్ నిరంజన్
పూరి జగన్నాథ్ సినిమాల లో పాత్రలు ఎంత రా గా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో సోను సూద్ క్యారెక్టర్ కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటుంది.
#9 సూపర్
ఈ సినిమాలో సోనూసూద్ విలన్ అనడం కంటే సెకండ్ హీరో అనడం బెటర్. ఎందుకంటే తన చెల్లిని చంపాడు అనే కోపంతో హీరో మీద పగ పెంచుకుంటాడు. ఈ సినిమాలో అది కూడా ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఒక హీరోతో తప్ప, మిగిలిన అందరితో సోనూసూద్ పాత్ర మామూలుగానే ఉంటాడు.
#10 ఆగడు
ఈ సినిమాలో కథకి తప్ప మిగిలిన ఏ విషయానికి వంక పెట్టడానికి లేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ ఈ సినిమాలో డైలాగులు, పర్ఫామెన్స్ బాగా గుర్తింపు పొందాయి.
#11 అశోక్
ఈ సినిమాలో కూడా ఒకవైపు కామ్ గా ఉంటూనే మరొకవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎంతో బాగా నటించారు సోనూసూద్. ఇది ఖచ్చితంగా సోనూసూద్ అండర్ రేటెడ్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు.
#12 మిస్టర్ మేధావి
ఈ సినిమా ఎక్కువ మంది చూసి ఉండరు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ తో తన ప్రేమను వ్యక్త పరచనీయకుండా అడ్డుగా ఉండే క్యారెక్టర్ చేశారు సోనూసూద్. విలన్ లాగా అనిపించినా కూడా విలన్ కాదు. మిస్టర్ మేధావి సినిమాలో ఎక్స్టెండెడ్ కేమియో రోల్ లో నటించారు సోను సూద్. సోను సూద్ పోషించిన పాత్రల్లో డిఫరెంట్ పాత్రల జాబితాలో ఈ సినిమా ఉంటుంది.
End of Article