Ads
సౌత్ , నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో విలన్ గా నటించి మనల్ని అలరించిన సోనూ సూద్ కరోనా టైం లో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ కష్టాన్ని సోషల్ మీడియాలో పెడితే చాలు వాళ్లకు నేనున్నానంటూ సోనూసూద్ ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు.ఇలా సోనూసూద్ ఇప్పటివరకు సహాయం చేయడం కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతుంది. కరోనా టైంలో ప్రభుత్వాలతో పనిలేకుండా అవసరం ఉన్న వాళ్ళని ఆదుకుంటున్న సోనూసూద్ రీల్ మీద విలన్ ఏ కానీ రియల్ లైఫ్ లో హీరో అంటూ ప్రజలు అభినందిస్తున్నారు.
Video Advertisement
మొదట్లో ఇది చూసిన రాజకీయ పార్టీలు ఆయన ఎక్కడ సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పాల్గొంటారని భయపడ్డాయి. అలాంటి వారికి సోనూసూద్ మరోసారి నేను రాజకీయాల్లోకి రానని క్లారిటీ ఇచ్చేశారు.సోనూసూద్ దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్నారు.ఈయన విలన్ గా నటించడానికి భారీ పారితోషికాన్ని తీసుకుంటారు.ఇలా ఆయన సంపాదించిన డబ్బును ముంబైలో హోటల్స్ తెరవడానికి ఖర్చు చేశారు.దీనితో ఇటు సినిమాలు చేస్తూ అటు హోటల్ బిజినెస్ రన్ చేస్తూ సోనూసూద్ తన ఆస్తి విలువను 130 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు.ఇక తాజాగా ఆయన చేసిన సహాయాలు కోసం పది కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు.
ఒక వలస కూలీ నుండి సోనూసూద్ ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడం అందరినీ ఇన్ స్పైర్ చేస్తుంది.
End of Article