Ads
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ ప్రస్తుతం రియల్ హీరో అనిపించుకుంటున్నారు.. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులకు చలించిపోయి ప్రభుత్వాల అనుమతి తీసుకుని బస్సులను ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపించాడు..ఈ నేపద్యంలో అనేకమంది సోనూసూద్ కి రకరకాల విన్నపాలు చేస్తుంటే ఒక నెటిజన్ వింత కోర్కెను కోరాడు..దానికి సోనూ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది..టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనేమో..
Video Advertisement
“నా గర్ల్ ఫ్రెండ్ ని చూసి రెండు నెలలు అవుతుంది. బీహార్లో ఉన్న నా లవర్ దగ్గరికి పంపించు భయ్యా” అంటూ ట్వీట్ చేసాడు ఓ నెటిజెన్. ‘భయ్యా.. కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష’ అంటూ తన స్టైల్ లో రిప్లై ఇచ్చారు సోను సూద్.
అలాగే మరో యువతి. సెలూన్ కి వెళ్ళడానికి హెల్ప్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. సెలూన్ కి వెళ్లి ఏం చేస్తారు? అక్కడ పని చేసే వారందరిని ఊరికి పంపించేసాను అని కౌంటర్ ఇచ్చారు సోను సూద్.
“సోనూ భాయ్ , నేను మా ఇంట్లో ఉండిపోయాను, నన్ను కొంచెం మద్యంషాపు వరకు తీసుకు వెళ్లడానికి సాయం చేయవా” ఇది ఒక నెటిజన్ సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్టు..దీనికి సోనూసూద్ ఇచ్చిన రిప్లై ఏంటంటే “దాందేముంది, మద్యం షాపు నుండి తిరిగి ఇంటికి కూడా జాగ్రత్తగా తీస్కెళ్తాను, కాకపోతే అది ఇప్పుడు అత్యవసరం అయితే చెప్పండి”అంటూ రెస్పాండ్ అయ్యాడు.
వలస కూలిలను ఇళ్లకు పంపడం మాత్రమే కాదు..డాక్టర్లకు 1500 పిపిఇ కిట్లు పంపిణి, ముంబాయ్ లో ఉన్న తన స్టార్ హోటల్ ని పారిశుద్య, పోలీస్,వైద్య సిబ్బందిని వాడుకోమని చెప్పడం, వారికి కావలసిన సౌకర్యాలు,ఆహార వసతి కల్పించడం..ఒకటీరెండేమిటి..మొదటి నుండి అలుపెరగకుండా తనకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉన్నాడు సోనూ సూద్..డబ్బుది ఏముంది ఇప్పుడు ఉంది కాబట్టి సాయం చేస్తున్నాను, తర్వాత మళ్లీ సంపాదించుకుంటాను అని ధీమాగా చెప్తున్న సోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు..
కష్టకాలంలో ఆదుకుంటున్న వ్యక్తిని ఇలాంటి వెకిలి సాయం అడగడం ఎంతవరకు సబబు అని ఆ వ్యక్తి చేసిన ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్స్.. సోనూ సూద్ ఇచ్చిన రిప్లై కి ఫిదా అవుతున్నారు.
End of Article