Home Filmy Adda “V” సినిమా చూడాలి…అమెజాన్ ప్రైమ్ ఇప్పించమని అడిగిన నెటిజెన్ కి “సోనూసూద్” క్రేజీ కౌంటర్.!

“V” సినిమా చూడాలి…అమెజాన్ ప్రైమ్ ఇప్పించమని అడిగిన నెటిజెన్ కి “సోనూసూద్” క్రేజీ కౌంటర్.!

by Sainath Gopi

Ads

కరోనా కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఎంతోమందిని తమ స్వస్థలాలకు చేర్చారు సోనూసూద్. అంతేకాకుండా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా సహాయం చేశారు.

Video Advertisement

సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా సహాయం అవసరం అనిపిస్తే తనవంతు సహాయం చేయడంలో ముందున్నారు సోనూసూద్. మనం సినిమాల్లో చూసే సోనుసూద్ కి బయట చూసే సోను సూద్ కి అసలు పోలికే లేదు అని సోనూసూద్ చేసే సహాయాన్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.

నాని నటించిన 25వ చిత్రం వి సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది అనే సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

అయితే ట్విట్టర్ లో ఒకతను తను “వి” సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని, అమెజాన్ ప్రైమ్ ఎకౌంట్ ఇప్పించమని, ఒక సంవత్సరం కి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పించి హెల్ప్ చేయండి అంటూ మెసేజ్ చేసాడు. దీనికి సోను సూద్ క్రేజీ రిప్లై ఇచ్చారు. టీవీ కూడా పంపించాలి…ఏసీ పెట్టించి పాప్ కార్న్ కూడా పంపించాలా అంటూ కౌంటర్ వేశారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. సహాయం చేస్తున్నారు కదా అని అతి చేస్తున్నారు కొందరు.


End of Article

You may also like