Ads
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయి ఎంతో మనోవేదన అనుభవించిన విషయం తెలిసిందే.అయితే సోను సూద్ ప్రభుత్వాల దగ్గర నుండి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకోని వారిని తమ ప్రాంతాలకు చేర్చిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు వలస కార్మికులను కలవడానికి వెళ్లిన సోను సూద్ కు నిరాశ ఎదురైంది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
సోమవారం రాత్రి వలస కార్మికులను కలవడానికి సోను సూద్ బంద్రా స్టేషన్ టెర్మినల్ దగ్గరకి వెళ్లారు.అయితే వలస కార్మికులను సోను సూద్ కలవకుండా రైల్వే పోలీసులు అడ్డగించి సోను సూద్ ను వెనకకు పంపారు.సోమవారం రాత్రి 8 గంటలకు ఉత్తరప్రదేశ్ నుండి బంద్రా వెళ్లే ప్రత్యేకమైన రైలు బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.సోను సూద్ వలస కార్మికులను కలవకుండా వెనకకు పంపడం వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉంది అని కొన్ని అభిప్రాయాలూ వినపడుతున్నాయి.
Source:: The times of India
End of Article