ఐటీ దాడులపైన తొలిసారిగా స్పందించిన సోను సూద్. ఏమన్నారంటే ?

ఐటీ దాడులపైన తొలిసారిగా స్పందించిన సోను సూద్. ఏమన్నారంటే ?

by Sunku Sravan

Ads

కరోనా వంటి కష్ట కాలంలో ఎందరికో వారి కష్టాలకు బాసట గా నిలిచిన సోను సూద్ గురించి అందరికి తెలిసిందే. విలన్ గా అప్పటి దాకా అందరికి పరిచయస్థుడైన సోను సూద్. సహాయం అడిగిన వారికి సాయం చేస్తూ వారి కష్టాలని తీర్చిన సోను సూద్ అందరికి ఇప్పుడు హీరో అయ్యాడు. తన సేవ కార్యక్రమాలకి యావత్ దేశం ఆయనకి సెల్యూట్ చేసారు. ఒక ప్రభత్వం చేయవలసిన పనులు సోను సూద్ చేస్తున్నారు అంటూ ప్రశంసించారు.

Video Advertisement

sonusood 2

సోను సూద్ స్థాపించిన ఫౌండేషన్ లకి దాతలు విరాళాలు కూడా ఇచ్చారు. గత వారం ఐటీ శాఖ వారు సోను సూద్ ఆఫీసులు, ఫౌండేషన్ పైన సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 20 కోట్ల రూపాయల ఐటీ పన్ను ఎగ్గొట్టారని వారు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వార్త విని ఒక్కసారిగా సోను సూద్ అభిమానులు షాక్ అయ్యారు. దీనిపైన  తొలిసారిగా స్పందించిన సోనూసూద్ ట్విట్టర్ లో ఆయన తన అభిమానులతో ఇలా అన్నారు.

sonusood 3

“గత నాలుగు రోజులుగా అతిథులతో గడిపానని, ఐటీ అధికారులని ఉద్దేశించి చెప్పారు. ప్రతి భారతీయుడి ప్రార్థనలు ప్రభావం తప్పక చూపుతాయని అన్నారు. భారత దేశ ప్రజలకి తాను సేవ చేయాలని ప్రతిజ్ఞ చేసానని చేసి తీరుతానని అన్నారు, కష్టమైన రోడ్ల పైన ప్రయాణం సాఫీగా సాగుతుందని అన్నారు. తన ఫౌండేషన్ కి వచ్చే ప్రతి రూపాయి నిరుపేదల జీవితాలకోసమే అంటూ స్పష్టం చేసారు. గత నాలుగు రోజులు అధికారులతో బిజీ గా ఉన్నానని అందుకే మీ సేవకి దూరం అయ్యానంటూ చెప్పుకొచ్చారు. సోను సూద్ ట్వీట్ కి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు.


End of Article

You may also like