Home Filmy Adda 12 రోజులు 700 కిమీలు నడిచి “సోనూసూద్” ని కలిసిన అభిమాని…సోనూసూద్ ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

12 రోజులు 700 కిమీలు నడిచి “సోనూసూద్” ని కలిసిన అభిమాని…సోనూసూద్ ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

by Mohana Priya

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సహాయం అవసరం ఉంది. దాంతో అందరూ ఎవరికి చేతనైనంత వారు సహాయం చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి సహాయం చేసిన వ్యక్తి సోనూ సూద్.

Venkatesh walks 700 km to meet Sonu Sood

భారతదేశంలో ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సోనూ సూద్ చేయి అందించారు. అలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనూ సూద్. అయితే సోనూ సూద్ ని ఇటీవల హైదరాబాద్ కి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి కాలినడకన 700 కిలోమీటర్లు వెళ్లి ముంబైలో ఉన్న సోనూ సూద్ ని కలిశారు. వెంకటేష్ కి ముంబైకి వెళ్లడానికి 12 రోజులు పట్టింది.

Venkatesh walks 700 km to meet Sonu Sood

వెంకటేష్ ఇటీవల సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వెంకటేష్ తనకి సోనూ సూద్ ని కలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది అని, తనకి  సోనూ సూద్ హెల్ప్ చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు తన బాధని అర్థం చేసుకున్నాడు అని అనిపించింది అని, సోనూ సూద్ తనకి ఒక ఫోన్, ఖర్చులకి 5000 రూపాయల క్యాష్ ఇవ్వడంతో పాటు, తన కుటుంబానికి సహాయం చేస్తాను అని కూడా చెప్పారు అని చెప్పారు.

Venkatesh walks 700 km to meet Sonu Sood

సోనూ సూద్ మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ “అంత మంచి వ్యక్తి మన సమాజంలో ఉన్నందుకు మనం గర్వపడాలి కానీ ఆయన మీద నెగటివ్ కామెంట్స్ చేస్తే మనకి ఏమి వస్తుంది?” అని అన్నారు. అలాగే తాను ముంబై నుండి మళ్ళీ తిరిగి రావడానికి సోనూ సూద్ ఫ్లైట్ టికెట్ లు ఏర్పాటు చేశారు అని కూడా చెప్పారు వెంకటేష్.

watch video :

You may also like