“ప్రభాస్” తో పాటు… “త్రిష” తో 3 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన 7 హీరోలు..!

“ప్రభాస్” తో పాటు… “త్రిష” తో 3 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన 7 హీరోలు..!

by kavitha

Ads

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల వయసులోను తరగని అందంతో యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.

Video Advertisement

తరుణ్ హీరోగా నటించిన ద్విభాషా సినిమా నీ మనసు నాకు తెలుసు మూవీతో త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘వర్షం’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 20 ఏళ్లుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష కొందరు సౌత్ హీరోలతో మూడు అంతకన్నా ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. ప్రభాస్: 

త్రిష మొదటిసారి ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో త్రిష స్టార్ డమ్ ను అందుకుంది. ఈ మూవీ తరువాత ప్రభాస్ తో పౌర్ణమి, బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రాలలో నటించింది. 2. విక్టరీ వెంకటేష్: 

త్రిష తొలిసారిగా అగ్ర హీరో వెంకటేష్ తో 2007 లో ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వెంకటేష్ తో నమో వెంకటేశ, బాడిగార్డ్ చిత్రాలలో నటించారు.
3. సూర్య: 

త్రిష తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో 3 సినిమాలలో నటించారు. ఆ సినిమాలు ఏమిటంటే మౌనం పేసియాదే, ఆయుత ఎళుతు, ఆరు.
4. అజిత్:

హీరోయిన్ త్రిష తమిళ స్టార్ హీరో అజిత్ నాలుగు చిత్రాలలో నటించారు. ఈ జంట కోలీవుడ్ లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. త్రిష అజిత్ తో నటించిన సినిమాలు ఏమిటంటే జి, కిరీడం, మంకథ, యెన్నై అరిందాల్.
5. విక్రమ్: 

హీరోయిన్ త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో నాలుగు చిత్రాలలో నటించారు. ఆ చిత్రాలు సామీ, భీమా, పొన్నియన్ సెల్వన్ 1 మరియు 2.
6. జయం రవి: 

తమిళ స్టార్ హీరో జయం రవితో హీరోయిన్ త్రిష 5 చిత్రాలలో నటించారు. ఆ సినిమాలు ఏమిటంటే ఉనక్కుమ్ ఎనక్కుమ్, సకలకళ వల్లవన్, భూలోహం, పొన్నియన్ సెల్వన్ 1 మరియు 2.
7. దళపతి విజయ్:

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో హీరోయిన్  త్రిష కలిసి 5  సినిమాల్లో నటించారు.ఈ జంట కోలీవుడ్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా నిలిచారు. త్రిష, విజయ్ నటించిన సినిమాలు గిల్లి, కురువి, తిరుపాచి. ఆది మరియు లియో.

Also Read: “అర్జున్ రెడ్డి” లాగానే… ముందు “కాంట్రవర్సీ” సృష్టించి తర్వాత సూపర్ హిట్ అయిన 14 సినిమాలు..!

 

 


End of Article

You may also like