Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించారు. అధీరా అనే పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇలాంటి పాత్రని సంజయ్ దత్ పోషించడం చాలా అరుదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కథ చెప్పగానే సంజయ్ దత్ తన పాత్రను తానే డిజైన్ చేసుకుంటాను అని చెప్పారట. నిజంగానే సంజయ్ దత్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాతో సంజయ్ దత్ కి సౌత్ ఇండస్ట్రీ లో కూడా చాలా మంచి పేరు వచ్చింది. కానీ సంజయ్ దత్ కి ఇది మొదటి సౌత్ సినిమా కాదు.
అంతకు ముందే సంజయ్ దత్ ఒక సౌత్ సినిమాలో నటించారు. అది కూడా ఒక తెలుగు సినిమాలో నటించారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా మలయాళం సినిమా చంద్రలేఖకి రీమేక్ గా రూపొందింది. ఇందులో సంజయ్ దత్ ఒక గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. సంజయ్ దత్ నటించిన పాత్ర పేరు రాజ్ కపూర్. ఆ తర్వాత మళ్లీ సౌత్ సినిమాలో సంజయ్ దత్ ఇప్పుడు నటించారు.
End of Article