Home Instagram బీచ్ లో స్పేస్ సూట్ జంట ఆతర్వాత ఏమైందో చూడండి.

బీచ్ లో స్పేస్ సూట్ జంట ఆతర్వాత ఏమైందో చూడండి.

by Megha Varna

కరోనా పుణ్యనా జనాలు కలుసుకోవడానికి చేయి చేయి కలపడానికి భయపడిపోతున్నారు. పాపం ఎప్పుడూ చట్టాపట్టాలేసుకోని తిరగేసే లవర్స్ కూడా అటు కలుసుకోలేక ఇటు దూరంగా ఉండలేక కరోనా దెబ్బ సతమతమైపోతున్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేని ఓ జంట తాజాగా ఓ వింత పనిని చేశారు.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.బ్రెజిల్ కు చెందిన టెర్సియో గల్డినో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడేవాడు.దాని నుండి డాక్టర్ల ట్రీట్మెంట్ ద్వారా కొద్దిరోజుల క్రితం బయటపడ్డాడు.ప్రస్తుతం తనకి దొరికిన ఖాళీ సమయంలో భార్య అలీసియా లీమా తో కలిసి
బీచ్ లో తిరగాలని అనుకున్నాడు.ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తను ప్రస్తుత పరిస్థితులలో కరోనా సోకకుండా ఉండడానికి బీచ్ కు స్పేస్ సూట్ లో వెళ్ళాడు.అది చూసిన అక్కడ జనులంతా తమ కెమెరా లకు పని చెప్పారు.ఆతర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.మీరు కూడా ఆ ఫోటో పై ఓ లుక్ వేయండి.

 

https://www.instagram.com/p/CCjB95Oh_3e/?igshid=18f44ksvf1vaj

You may also like