Ads
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులయ్యారు. బాలు గారి మరణం తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎంతో మంది బాధలో ఉన్నారు. ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బాలు గారి మరణం పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే బాలు గారి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. బాలు గారికి సినిమా ఇండస్ట్రీలో, అలాగే బయట కూడా ఎంతో మంది మిత్రులు ఉన్నారు.
Video Advertisement
వాళ్ళందరూ బాలు గారి గురించి చెప్పే మాటలు వింటే ఆయన గొప్ప కళాకారుడు మాత్రమే కాకుండా ఎంతో గొప్ప వ్యక్తి అనే విషయం కూడా అర్థమవుతుంది. కొంతకాలం క్రితం బాలు గారు తుర్పు గోదావరి జిల్లా కొత్తపేట కి చెందిన శిల్పి వడయార్ రాజ్ కుమార్ చేత తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించుకున్నారు. తన తల్లిదండ్రుల విగ్రహాలను చూసి బాలు గారు ఎంతో ఆనందపడ్డారట.
బాలు గారు తన విగ్రహం తయారు చేయమని వడయార్ రాజ్ కుమార్ ని కోరారు. ఆ విగ్రహాన్ని బాలు గారు తన రికార్డింగ్ థియేటర్ లో ఉంచాలి అని అనుకున్నారట. బాలు గారి విగ్రహం తయారు అయిన తరువాత బొమ్మ చాలా బాగుంది అని, దానికి వేరే ఏ కరెక్షన్స్ అక్కర్లేదు అని, అలాగే చేస్తే సరిపోతుంది అని వడయార్ రాజ్ కుమార్ కి ఒక వాయిస్ రికార్డింగ్ పంపించారు బాలు గారు. కానీ తన విగ్రహాన్ని నేరుగా చూసుకోక ముందే బాలు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.
watch video:
End of Article