“చంద్రయాన్-3” ప్రత్యేకత ఏంటి..? ఇది చంద్రుడి మీదకి ఏం తీసుకెళ్తోంది..?

“చంద్రయాన్-3” ప్రత్యేకత ఏంటి..? ఇది చంద్రుడి మీదకి ఏం తీసుకెళ్తోంది..?

by kavitha

Ads

చంద్రయాన్‌ 3 ప్రయోగం కోసం ఇండియా ఒక్కటే కాకుండా యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలో చంద్రయాన్‌ 3 నేడు (జులై 14) మధ్యాహ్నం సరిగ్గా 2.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

Video Advertisement

చంద్రయాన్‌–3 మిషన్‌ను నింగిలోకి మోసుకెళ్లేందుకు బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం–3 సిద్ధం అయ్యింది. ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి 4 ఏళ్ల నాటి చంద్రయాన్‌–2 ఫెల్యూర్ చేదు జ్ఞాపకాలను పోగొట్టాలని ఇస్రో చాలా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Chandrayaan-3భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని అన్వేషణ కోసం 2008లో చంద్రయాన్-1 ను ప్రయోగించింది. ఇది మూన్ పై నీరు ఉందని రుజువు చేసింది. ఆ తరువాత చంద్రుని పై ల్యాండింగ్, అన్వేషణ కోసం చంద్రయాన్-2 అంతరిక్ష నౌకను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, 2019లో ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపం వల్ల  చంద్రయాన్-2ను మోసుకెళ్లిన ల్యాండర్ ల్యాండింగ్‌లో ఫెయిల్ అయ్యి చంద్రుడి పై కూలిపోయింది. ఈసారి సాంకేతిక లోపం తలెత్తకుండా చంద్రయాన్ 3ని ఇస్రో సిద్ధం చేసింది.
శాస్త్రవేత్తలు గతంలో మాదిరిగా జరగాకుండా ఉండేందుకు చాలా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. అంటే ప్రొపల్షన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉండే రోవర్ ల్యాండర్‌ ను చంద్రుని పై 100కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుని కక్ష్య నుండి చంద్రున్ని, భూమిని, అధ్యయనం చేయడం కోసం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రుని ఉపరితలం నివాస యోగ్యమో, లేదో తేల్చడం కోసం, చంద్రుని పై జరిగే మార్పులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఇప్పటి వరకు చాలా దేశాలు చంద్రుని ఉత్తర ధ్రువం పై ఎన్నో పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం ఇప్పటిదాకా చంద్రుని పై ఎవరు అడుగుపెట్టని దక్షిణ దిశను చేరాలనే ప్రయత్నిస్తోంది. అక్కడ భారత జెండాను పెట్టనున్నారు.  చంద్రయాన్‌–1 నుంచి చంద్రయాన్‌–3 వరకు దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ఇస్రో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు ప్రాంతంలో చంద్రయాన్‌–3 ల్యాండర్‌ను దించనున్నారు. యావత్ ప్రపంచం చంద్రయాన్‌ 3 కోసం ఎదురుచూస్తోంది.

Also Read: “హిమాచల్ ప్రదేశ్” వరదల్లో సంభవించిన ఆస్తి నష్టం ఎంతో తెలుసా..?

 


End of Article

You may also like