గుంటూరు కారం…. ఐటెం సాంగ్ కాదు…స్పెషల్ సాంగ్….!

గుంటూరు కారం…. ఐటెం సాంగ్ కాదు…స్పెషల్ సాంగ్….!

by Mounika Singaluri

Ads

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం చిత్రం పైన రోజురోజుకు ఒక రూమర్ పుట్టుకొస్తుంది. ఇప్పటికే చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే ఇంకా ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది నెల 21 నుంచి షూటింగ్ చేయనున్నట్లు చిత్ర టీం ప్రకటించింది. అయితే ముందు నుంచి కూడా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం కాస్త నిజం కాదు అంటునారు.

Video Advertisement

గుంటూరు కారం సినిమాలో ఐటెం సాంగ్ కాకుండా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ లో సినిమా మెయిన్ కాస్టింగ్ మొత్తం కనిపిస్తుందని వాదన కూడా వినిపిస్తుంది. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని చెబుతున్నారు. అయితే సంక్రాంతికి ఇంకెన్ని రోజులో లేకపోవడంతో ఇంకా ఈ సాంగ్ షూటింగ్ పూర్తికాలేదు. ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తారో అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాల కంటే కూడా బాగుంటుందని టాక్ వినిపిస్తుంది. సంక్రాంతి ఎన్ని చిత్రాలు విడుదలవుతున్నా కూడా హైప్ మొత్తం గుంటూరు కారం చుట్టూరనే ఉంది. కచ్చితంగా గుంటూరు కారం సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రేసులో విన్నారుగా నిలుస్తుందని అంటున్నారు.


End of Article

You may also like