రియల్ హీరో: తండ్రి కల నెరవేర్చడం కోసం చిన్నతనం నుండే…చివరగా తండ్రితో సంతోష్ మాట అదే.!

రియల్ హీరో: తండ్రి కల నెరవేర్చడం కోసం చిన్నతనం నుండే…చివరగా తండ్రితో సంతోష్ మాట అదే.!

by Mohana Priya

Ads

కల్నల్  బిక్కుమళ్ల సంతోష్. ఎక్కడ చూసినా ఇప్పుడు అదే పేరు. చైనా ఇండియా మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్లలో సంతోష్ ఒకళ్ళు.పదిహేనేళ్ల సర్వీసు లో నాలుగు ప్రమోషన్లు. 37 ఏళ్లకే కల్నల్ హోదా దక్కింది.ఇలా సంతోష్ జీవితంలో ఘనతలు, గుర్తింపులు ఎన్నో ఉన్నాయి.

Video Advertisement

చిన్నప్పటి నుండి ఆర్మీ అంటే ఆసక్తి

సూర్యాపేట జిల్లా లోని విద్యానగర్ కు చెందిన ఉపేంద్ర మంజుల కుమారుడు సంతోష్. ఉపేంద్ర కి దేశానికి సేవ చేయాలనే ది కల. కానీ పరిస్థితులవల్ల కల కలగానే ఉండిపోయింది. దాంతో తన కొడుకుని ఆర్మీ లో కి పంపాలి అనుకున్నాడు.

సంతోష్ కూడా చిన్నప్పటి నుండి  ఆర్మీ అంటే ఆసక్తి చూపడంతో ఇంక ఏదేమైనా  సంతోష్ ఆర్మీ కి వెళ్ళటానికి తన శాయశక్తులా ప్రయత్నించాలి నిర్ణయించుకున్నారు. సంతోష్ కూడా అందుకు తగ్గట్టే ఆర్మీ కి వెళ్లడానికి  చిన్నప్పటి నుంచి ఎంతగానో కష్టపడ్డారు.

మొదటి విధి బీహార్ లో

సంతోష్ అన్న ప్రాథమిక విద్యని తన స్వస్థలమైన సూర్యాపేట్ లోనే అభ్యసించారు. ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ హై స్కూల్లో చదువుకున్నారు. తర్వాత పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో డిగ్రీ చదివారు. డిగ్రీ తర్వాత డెహ్రాడూన్లో సైనిక శిక్షణ పొందారు. 2004లో లో బిహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌లో లెఫ్టినెంట్ గా విధుల్లో చేరారు.

లాక్ డౌన్ కారణంగా

సంతోష్ కి 2010లో సంతోషి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు అభిజ్ఞ కొడుకు అనిరుధ్. సంతోష్ చాలాకాలం నుండి బదిలీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫిబ్రవరి 2020లో లెఫ్టినెంట్ కల్నల్ నుండి కల్నల్ హోదా పొందాక ఫలించింది.

సంతోష్ హైదరాబాద్ కి బదిలీ అవ్వడానికి అధికారులు అనుమతించారు. కానీ లాక్ డౌన్ కారణంగా బదిలీకి సంబంధించిన పనులు పూర్తి అవలేదు. దాంతో సంతోష్ లడక్ లో ఉండిపోవాల్సివచ్చింది. అప్పుడే ఇండియా చైనా సరిహద్దుల ప్రాంతంలో ఉన్న గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో దేశం కోసం ప్రాణాలర్పించారు సంతోష్.

నా కల నా కొడుకు నెరవేర్చాడు

సంతోష్ తండ్రి ఉపేంద్ర మాట్లాడుతూ ” నేను దేశానికి సేవ చేయాలనుకున్నాను. కానీ చేయలేకపోయాను. నా కొడుకు నా కోరిక నెరవేర్చాడు. చిన్నప్పటినుంచి ఎంతో క్రమశిక్షణతో తో ఆర్మీ కి వెళ్లడానికి ఎంతో కష్టపడ్డాడు. సంతోష్ సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషించాను. ఒక భారతీయుడిగా సంతోష్ దేశం కోసం ప్రాణాలర్పించి వీర మరణం పొందినందుకు గర్వంగా ఉంది.

కానీ ఒక తండ్రిగా నా కొడుకు ఇంక లేడు అన్న విషయాన్ని తలచుకుంటే చాలా బాధగా ఉంది. తను చివరిసారిగా నాతో మాట్లాడింది ఆదివారం. అది కూడా ఒక్క నిమిషమే. కోవిడ్ పరిస్థితి అంతా సర్దుకుంటే తాను హైదరాబాద్ కి వచ్చే వీలు ఉంటుంది అని చెప్పాడు. అమ్మతో మాట్లాడతాను అని, ఫోన్ తన తల్లికి ఇవ్వమన్నాడు. అదే సంతోష్ నాతో మాట్లాడిన చివరి మాట” అని చెప్పారు.

ఇండియా చైనా యుద్ధం కాకుండా, అంతకుముందు కూడా సంతోష్ 2007లో సరిహద్దుల్లో ముగ్గురు చొరబాటుదారులను దేశంలోకి ప్రవేశించకుండా అక్కడే అంతమొందించారు. 15 ఏళ్ళ సర్వీసు లో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఢిల్లీ, లడక్, పాకిస్తాన్ సరిహద్దుల్లో, ఆఫ్రికా దేశంలోని కాంగోలో తన విధులు నిర్వర్తించారు సంతోష్. సంతోష్ తో పాటు మరో 19 మంది ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ భారత దేశ వీరులందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం.


End of Article

You may also like