“నీ ఏజ్ కి… నీ వేషాలకి సంబంధం ఉందా..?” అన్న వ్యక్తికి… “స్రవంతి చొక్కారపు” స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

“నీ ఏజ్ కి… నీ వేషాలకి సంబంధం ఉందా..?” అన్న వ్యక్తికి… “స్రవంతి చొక్కారపు” స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా చాలా మంది అమ్మాయిలు పాపులరిటీ సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియాలోను వారిని ఫాలో అవుతున్నవారు ఎక్కువే. బిగ్ బాస్ కు వెళ్ళక ముందు అంతగా తెలియనివారు కూడా బిగ్ బాస్ కి వెళ్లడంతో క్రేజ్ తెచ్చుకున్నారు.

Video Advertisement

అలాంటి వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా ఒకరు. యూట్యూబ్ లో వివిధ ఛానల్స్ కోసం సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన స్రవంతి. బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె వయసు గురించి మాట్లాడిన వ్యక్తికి స్రవంతి చొక్కారపు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్రవంతి చొక్కారపు యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. జెమినిలో కొన్ని రోజులు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. ‘పుష్ప’ మూవీ విడుదల సమయంలో పుష్ప యూనిట్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత మల్లెమాల సంస్థ షోస్ లో స్రవంతి సందడి చేసింది. దీనివల్ల ఆమెకు ‘బిగ్ బాస్’ లో పాల్గొనే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ షోతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అఖిల్, అజయ్ లతో ఉంటూ వార్తల్లో నిలిచేది. స్రవంతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఆమెకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖలో షేర్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. వీటిని చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజెన్ మాత్రం “నీ వయసుకి మరియు నువ్వు వేసే వేషాలకి ఏమైనా సంబంధం ఉందా?” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పెట్టిన వ్యక్తికి స్రవంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తరువాత ఆ వ్యక్తి తన కామెంట్లను డిలీట్ చేశాడు. దానికి కూడా స్రవంతి “ఏంట్రా నాన్న భయమేసిందా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేశావు” అంటూ కామెంట్ చేసింది.

https://www.instagram.com/p/CyIwr0pR27Q/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D&img_index=10

Also Read: హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?


End of Article

You may also like