శ్రీలీల ఇంక అందుకే పనికొస్తుందా….దానికోసమే వాడుతున్నారా…?

శ్రీలీల ఇంక అందుకే పనికొస్తుందా….దానికోసమే వాడుతున్నారా…?

by Mounika Singaluri

Ads

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శ్రీ లీల….ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.ఆ తర్వాత శ్రీ లీలకి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఆ సినిమాలో శ్రీ లీల డాన్సులు నటనతో మంచి మార్కులే కొట్టేసింది.

Video Advertisement

తర్వాత నటిచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు కేవలం శ్రీలీలని కథతో సంబంధం లేకుండా కేవలం డాన్స్ లు కోసమే తీసుకుంటున్నారు అంటూ పలువురు విమర్శలు చేశారు. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలో ఆమె పాత్రలకు ఉన్న ప్రాధాన్యత చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఉన్నట్టుండి శ్రీ లీల కెరీర్ డౌన్ ఫాల్ మొదలైనట్టు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా నుండి తాజాగా కుర్చీ మడత పెట్టి అనే మాస్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలో మాస్ స్టెప్పులతో శ్రీలీల రెచ్చిపోయింది. ఇది చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో కూడా శ్రీ లీలని డాన్సులు కోసమే తీసుకున్నారా లేదా ఆమె పాత్రకు ఏమైనా ప్రాధాన్యత ఉందా అంటూ అంటున్నారు. కథలో ప్రాధాన్యత లేకపోతే శ్రీ లీల పెద్ద తప్పు చేస్తుందని ఈ విషయాన్ని ఆమె త్వరగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇక శ్రీలీలను డాన్సులు కోసం మాత్రమే వాడుతున్నారు అంటూ ఆమె అభిమానులు కూడా బాధపడుతున్నారు. డాన్స్ రావడం శ్రీలీల ప్లస్ పాయింట్ అయితే ఇప్పుడు అదే మైనస్ గా కూడా మారుతుంది


End of Article

You may also like