శ్రీలీల కట్టుకున్న ఈ చీర ధర ఎంతో తెలుసా..? ఇలాంటివి 20 వస్తాయి ఏమో..?

శ్రీలీల కట్టుకున్న ఈ చీర ధర ఎంతో తెలుసా..? ఇలాంటివి 20 వస్తాయి ఏమో..?

by Mohana Priya

Ads

గత సంవత్సరం వరుస సినిమాలు చేసి, ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నటి శ్రీలీల. శ్రీలీల మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి గతంలో ధమాకా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు.

Video Advertisement

sreeleela saree cost in movie launch puja event

సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోనుంది. అయితే, పూజా కార్యక్రమంలో శ్రీలీల కట్టుకున్న చీర మీద అందరి దృష్టి పడింది. శ్రీలీల ఈ చీరలో మరింత అందంగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీలు మామూలు దుస్తులు వేసుకున్నా కూడా వాటి ధర ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు శ్రీలీల కట్టుకున్న చీర ధర కూడా అంతే ఉంటుంది. ఈ చీరని ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. ఈ చీర ధర 70 వేల రూపాయలు. ఇప్పుడు డిస్కౌంట్ పోగా 49 వేల రూపాయలకి ఈ చీర అందుబాటులో ఉంది. చీర చూడడానికి చాలా సాధారణంగా ఉంది. పెద్ద హెవీ వర్క్ కూడా లేదు.

కానీ ఈ చీర కాస్ట్ విన్న తర్వాత ఎవరి నోటి నుండి మాట రావట్లేదు. ఎందుకంటే, సాధారణంగా ఇలాంటి చీరలు రెండు వేలకు మించి ఉండవు. వెయ్యి రూపాయల లోపే ఈ చీరలు దొరుకుతాయి. మహా అయితే, మెటీరియల్ చాలా బాగుంటే, 2000 ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండే అవకాశం లేదు. అంత సాధారణంగా ఈ చీర ఉంది. కానీ చీర ధర మాత్రం అసలు సాధారణంగా లేదు. కానీ ఏదేమైనా కూడా, సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అంటే ఇలాగే ఉంటుంది. వాళ్లు రోజువారి జీవితంలో వాడే దుస్తుల ధరలు కూడా వేలల్లోనే ఉంటాయి. వాళ్ల జీవనశైలి అంత. ఇంక బ్యాగ్స్, వాచ్ ల ధరలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లలో ఉన్న వాచ్ లు కొనుక్కున్న సెలబ్రిటీలను చాలా మందిని చూశాం. బ్యాగ్స్ కి, గడియారాలకి, ఫుట్ వేర్ కి ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటాయి. దుస్తుల ధరలు కూడా దాదాపు ఇదే విధంగా ఉంటాయి.


End of Article

You may also like