‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో శ్రీలీల గడుల చీర ధర ఎంతో తెలుసా..?

‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో శ్రీలీల గడుల చీర ధర ఎంతో తెలుసా..?

by kavitha

Ads

సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు.

Video Advertisement

రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు సాయంత్రం గుంటూరులో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో శ్రీలీల చీరలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే ఆ చీర ఖరీదు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గుంటూరులో జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన చిత్రాలకు రివ్యూ చెప్పే నాన్నగారు ఇప్పుడు లేరని, ఇక అభిమానులే తనకు అమ్మ నాన్న అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల తన మాటలతోనే కాకుండా, ట్రెండీ శారీలో ఆకట్టుకుంది.
శ్రీలీల బాటిల్ కలర్ గడుల శారీలో స్టైలీష్ లుక్‏లో మెరిసింది. ఈ ఈవెంట్ కు చీరలో మెరిసిన శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టుకున్న శారీ కొంచెం డిఫరెంట్ గా, స్టైలీష్ గా కనిపించడంతో నెటిజెన్లు ఆ శారీ ఖరీదు మరియు వివరాల గురించి ఆన్లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు.
అయితే ఆ శారీ రేటు చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలీల కట్టుకున్న శారీ ఖరీదు అక్షరాల 1.59.000 రూపాయలు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ పేరుతో ‘సవన్ గాంధీ’ అనే వెబ్ సైట్ లో ఈ శారీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: పూర్తిగా ముంబైకి షిఫ్ట్ అయిపోయిన మంచక్క.. ఇంద్ర భవనం లాంటి ఇంట్లో కొత్త జీవితం!


End of Article

You may also like