Ads
నిన్న ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా, పంజాబ్ కింగ్స్ తో, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది. 2 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అయితే, హైదరాబాద్ జట్టులో ఆడిన ఒక ప్లేయర్ పేరు మాత్రం ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అతనే నితీశ్ కుమార్ రెడ్డి. నిన్నటి మ్యాచ్ లో నితీశ్ 37 బంతుల్లో 64 పరుగులు స్కోర్ చేశారు. హైదరాబాద్ జట్టు అంత స్కోర్ చేసింది అంటే అందుకు కారణం ఇతనే. నితీశ్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ జట్టులో సభ్యులు. నితీశ్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు. పేస్ ఆల్‌రౌండర్ గా కూడా రాణిస్తున్నారు.
Video Advertisement
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 3 ఓవర్లకి బౌలింగ్ చేసి, 33 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టారు. ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేయడం మాత్రమే కాకుండా, ఒక వికెట్ తీసి ఒక క్యాచ్ పట్టిన మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. నితీశ్ కి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుండి విరాట్ కోహ్లీ ఆట తీరుని చాలా ఇష్టపడేవారు. నితీశ్ తండ్రి పేరు ముత్యాల రెడ్డి. నితీశ్ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు అంటే అందుకు కారణం ఆయన తండ్రి. నితీశ్ ని ఇంత దూరం తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ముత్యాల రెడ్డి కబడ్డీ ప్లేయర్. నితీశ్ కి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రికెట్ అకాడమీ లో చేర్చారు.
ముత్యాల రెడ్డి విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేస్తారు. అయితే ఒకసారి ఉదయ్‌పూర్ బదిలీ అయ్యింది. కానీ తన కొడుకు ప్రాక్టీస్ కి అడ్డుకాకూడదు అనే ఉద్దేశంతో బదిలీని కూడా వదులుకున్నారు. నితీశ్ 2018 లో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలిపారు. “మా నాన్న నా కోసం చాలా త్యాగాలు చేశారు. కానీ ఒక రోజు నేను ఆయనని గర్వపడేలాగా చేస్తాను” అని రాశారు. ఇప్పుడు కట్ చేస్తే 6 సంవత్సరాలు తర్వాత నితీశ్ చెప్పినట్టే చేశారు. తన తండ్రి పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ఆయనని గర్వపడేలాగా నితీశ్ చేశారు. నితీశ్ ఆట తీరుని చూసిన ఎంతో మంది సీనియర్ ప్లేయర్స్ అతను చాలా పెద్ద క్రికెటర్ అవుతారు అంటూ అభినందిస్తున్నారు.
ALSO READ : “ఫిదా” సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?
End of Article