అప్పుడు చెరువులోకి దూకి “శ్రీకాంత్” ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట.? ఎందుకో తెలుసా.?

అప్పుడు చెరువులోకి దూకి “శ్రీకాంత్” ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట.? ఎందుకో తెలుసా.?

by Megha Varna

నటుడు శ్రీకాంత్ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు శ్రీకాంత్. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు శ్రీకాంత్. అదే విధంగా స్టార్ హీరోల పక్కన కీలక పాత్రల్ని పోషించి అద్భుతమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

Video Advertisement

శ్రీకాంత్ ఇప్పటికి కూడా పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ కి మంచి హిట్ ని తీసుకొచ్చిన అఖండ సినిమాలో విలన్ పాత్ర చేసి శ్రీకాంత్ మెప్పించాడు. ఇది ఇలా ఉంటే ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చి శ్రీకాంత్ కొన్ని విషయాలను చెప్పాడు. చిన్నప్పుడు మీ తండ్రి తో గొడవపడి ఏకంగా చెరువులో దూకేస్తానని బెదిరించారట అని శ్రీకాంత్ ని ఆలీ అడిగితే..

దానికి ఇలా బదులిచ్చారు… ఏదో విషయంలో తప్పు చేయడంతో తన తండ్రి బాగా వార్నింగ్ ఇచ్చారని.. ఇంటికి రమ్మని పిలిచారని చెప్పాడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తనని కొడితే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రిని బెదిరించానని శ్రీకాంత్ చెప్పాడు.

watch video:


You may also like

Leave a Comment