Ads
కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ని కుదిపేసిన సంచలనాల శ్రీరెడ్డి.తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆమె పోస్ట్ చేసారు అంటే…జనాలు రోజులు తరబడి మాట్లాడుకోవాల్సిందే. తాజాగా నిహారిక పెళ్లిపై కూడా తన స్టైల్ లో కామెంట్స్ చేసారు శ్రీరెడ్డి.
Video Advertisement
“రేయ్…ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి లాగా… మీ ఇంట్లో పెళ్లి లాగా మీరెందుకు రా తెగ హడావుడి చేస్తూ పిసికేసుకుంటున్నారు,నాగబాబు కూతురు పెళ్లి కదా ? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయన వచ్చాడో…ఈయన వచ్చాడో ..డాన్స్ చేసాడో ..అంటూ హడావుడి చేయడం ఎందుకు…వీటిని తెగ షేర్ చేస్తారు..ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా. ఆ రైతులు రోడ్ల మీద కొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా!ఆ ఆ…హో హో …తూ…చేంజ్ అవ్వండి రా…
మీడియా కూడా దీన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, హైలైట్ చేయాల్సిన విషయాలు హైలైట్ చేయాలి. రైతు ల గురించి కానీ, తమిళనాడు లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది,పాపం ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ మీద చేయండి రా పనికిరాని ఎదవల్లారా! చివరగా నేనన్నది మీడియాను కాదు.. ఎవడో పిసికేసుకొని చూస్తున్నాడు కదా ఇలాంటి పెళ్లిళ్లన్నీ చూసేవాడిని అంటున్నా అని శ్రీ రెడ్డి ఫైర్ అయ్యింది.
watch video:
source: facebook/srireddy
ఆగస్టులో నిహారికకి, చైతన్య జొన్నలగడ్డతో ఎంగేజ్మెంట్ అయింది. చైతన్య తండ్రి ప్రభాకర్ రావు గుంటూరు రేంజ్ ఐజీ. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన చైతన్య జూబ్లీహిల్స్ లో ఉన్న భారతీయ విద్యా భవన్ లో చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. హైదరాబాద్ కి చెందిన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు చైతన్య. డిసెంబర్ 9 వ తేదీన ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్య వివాహం జరిగింది. నిహారిక ను పెళ్లి కూతుర్ని చేసిన దగ్గరినుండి చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి.
End of Article