బాలింతని అయినా మీకోసం బిడ్డను వదిలివచ్చా…మా కష్టాన్ని గుర్తించండి…!

బాలింతని అయినా మీకోసం బిడ్డను వదిలివచ్చా…మా కష్టాన్ని గుర్తించండి…!

by Megha Varna

Ads

మగబిడ్డకు జన్మనిచ్చి 22 రోజులు అయింది . హాయిగా మెటర్నిటీ హాలిడేస్ లో వుండవలిసిన ఆవిడ ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ బారి నుండి నగర ప్రజలను సంరక్షించేందుకు విధుల్లో చేరారు. ఆమె జీవీఎంసీ చైర్మన్ జి.సృజన . నగరం గురించి పూర్తి సమాచారం తెలిసిన నేను ఈ సమయంలో విధులలో వుండాలిసిన అవసరం వుంది అన్నారు ఆమె .

Video Advertisement

నేను చంటిపిల్లాడిని ఇంట్లో వదిలేసి వస్తున్నాను . వాడి సంరక్షణ నా భర్త అమ్మ చూస్తున్నారు . నాలాగే కుటుంబం పిల్లలు ఉన్న అధికారులంతా ఇప్పుడు విధులలో చేరారు అంటే దానికి కారణం ప్రజలను కరోనా బారి నుండి కాపాడడమే . ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న కారణంగా ప్రజలు భయాందోళనలలొ వున్నారని తెలిసి వారిలో దైర్యం నింపేందుకు జీవీఎంసీ ఎంతో కష్టపడుతుందని సృజన అన్నారు .

మా కష్టాన్ని గుర్తించి ప్రజలు తమ జాగ్రత్తలు వారు తీసుకుని దేశం కరోనా పై చేస్తున్న యుద్ధంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను  .అత్యవసరం అయితేనే బయటకి రావడం, వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడం . మిగతా సమయం అంతా ఇంట్లోనే ఉన్నట్లయితే ప్రజలు జీవీఎంసీ కష్టానికి విలువ ఇచ్చినట్లే అని అన్నారు . నిత్యవసరాల కొరత వస్తుందన్న భయం ఎవరిలోనూ వద్దు . అలాంటి పరిస్థితి రానివ్వం .ప్రజలలో ఈ భయం పోవాలి .

ప్రతి వార్డులోనూ మా బృందం తిరిగి కరోనా లక్షణాలు వున్న వారిని సకాలంలో గుర్తించి పరీక్షలు చేయించే దిశగా ముందుకు వెళ్తున్నాం . దయచేసి ప్రజలందరూ సహకరించి దీనిని సామజిక బాధ్యతగా తీసుకోవాలి . ప్రస్తుతానికి నగరంలో కరోనా రెండో స్టేజి లో వుంది, అది మూడో స్థాయికి చేరితే అదుపు చెయ్యడం చాల కష్టం . దీనిపై అందరికి అవగాహన ఉండాలి .

విదేశాల నుండి వచ్చిన వారు తమకు తాముగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి . హాస్పిటల్స్ లో శానిటైజెర్లు మాస్కులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము . మాకు వచ్చిన నివేదికల ప్రకారం విదేశాల నుండి వచ్చిన వారిలో 200 మంది ఆచూకీ తెలియడం లేదు . గతంలో 7 , 8 సవంత్సరాల క్రితం పెట్టిన చిరునామాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి.  వీరు ప్రస్తుతం ఎక్కడ వుంటున్నారనేది తెలియడం లేదు. ఎవరికైనా వారి చిరునామా తెలిసిన యెడల మాకు సమాచారం అందించండి.

ఇలా గుర్తించిన ప్రతివారి ఇంటికి స్టిక్కర్లు అంటించి మిగతావారిని అప్రమత్తం చేస్తున్నాం .దీనికి గాను పోలీస్ వారి సహకారం తీసుకుంటున్నాము .జీవీఎంసీ ఆధ్వర్యంలో 8 నిరాశ్రయుల షెల్టర్లు ఏర్పాటు చేశాము ఇందులో లాక్ డౌన్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళలేకుండా చిక్కుకుపోయిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం .దీనితో పాటు కొత్తగా 600 మంది ఉండగలిగే సామర్థ్యంతో కొత్త షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాం.


End of Article

You may also like