Ads
స్తంభించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రపంచదేశాలు మినహాయింపులు ఇచ్చాయి. అప్పటి నుండి కరోనా ఉదృతి తీవ్రంగా వ్యాపిస్తుంది.స్టార్ లు , సామాన్యులని తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తుంది.దీన్ని అదుపు చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించట్లేదు.దానితో మీకు కరోనా వచ్చిన విషయాన్ని దాచకండి ప్రభుత్వానికి సహకరించండి అంటూ కరోనా పాజిటివ్ వచ్చిన సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో తమ అభిమానులను కోరుతున్నారు.
Video Advertisement
తాజాగా తనకి కరోనా వచ్చిందంటూ మరో సౌత్ ఇండియన్ స్టార్ హీరో కూతురు ట్విట్టర్ లో పేర్కొన్నది.ఇంతకీ ఆమె ఎవరు ఇప్పుడు చూద్దాం.ఒకప్పుడు స్టార్ హీరోగా సౌత్ ఇండియా అంతా ఓ వెలుగు వెలిగిన అర్జున్. ప్రస్తుతం తెలుగు,తమిళ్ భాషలలో తెరకెక్కుతున్న చిత్రాలలో కీలక పాత్రలలో నటిస్తున్నాడు.ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దానితో ఐశ్వర్య వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం తను హోం క్వారంటైన్ లో ఉన్నానని అలాగే నాతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్లంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని కోరింది
End of Article