హీరోయిన్ నగ్మా గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా మారిపోయారో చూసారా..?

హీరోయిన్ నగ్మా గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా మారిపోయారో చూసారా..?

by Harika

Ads

పండు పండు పండు ఎర్ర పండు ఆపిల్ దాని పేరు.. ఈ సాంగ్ విన్నవాళ్ళేవరికైనా ఆపిల్ పండు లాంటి ఆ సినిమా హీరోయిన్ గుర్తొస్తుంది. నిజంగానే ఆపిల్ పండు కి పోటీ వచ్చేలా ఉంటుంది ఆమె అందం. ఆమె మరెవరో కాదు అందాల తార నగ్మా. 90వ దశకం లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఈమె చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల పక్కన నటించింది.

Video Advertisement

Hero who acted with nagma Jyothika and roshini

అటుపై బాలీవుడ్ లో కూడా అగ్ర నటులైన అమితాబచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లతో నటించి అక్కడ కూడా స్టార్ డం ని తెచ్చుకుంది. ఇక భాష సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన ఈమె ఆ సినిమాలో తన అందంతో పాటు అభినయంతో కుర్ర కారు మనసుల్లో గుబులు పుట్టించేది. సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ రోల్స్ లో మెప్పించిన ఈమె నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉండిపోయింది.

స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తోను, మరో ముగ్గురు స్టార్ హీరోలతోనూ ఎఫైర్లు నడిపిన ఈ భామ ఇప్పటికీ సింగిల్ గానే ఉండటం విశేషం. సినిమాలలో కెరియర్ పీక్స్ లో ఉండగానే రాజకీయాలలో అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరట్ లో ఎంపీగా పోటీ చేసింది. అయితే ఇప్పుడు ఈమె విశేషాలు ఎందుకంటారా.. తాజాగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఆ ఫోటోలు చూసిన నగ్మా డై హార్ట్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈమెనా మా కలల రాకుమారి? ఇలా తయారయింది ఏంటి అంటూ గుండెలు బాధేసుకుంటున్నారు. అంతగా లావైపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నగ్మా. సుమన్ హీరోగా తెరకెక్కిన పెద్దింటి అల్లుడు సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా కి ఘరానా మొగుడు సినిమా ఆమెని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది.


End of Article

You may also like