డిలీట్ చేసిన ఈ “భరత్ అనే నేను” హోలీ ఫైట్ సీన్ వెనకాల… ఇంత కథ ఉందా..?

డిలీట్ చేసిన ఈ “భరత్ అనే నేను” హోలీ ఫైట్ సీన్ వెనకాల… ఇంత కథ ఉందా..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా కంటే ముందు వీరిద్దరూ శ్రీమంతుడు సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే భరత్ అనే నేను కూడా హిట్ టాక్ సాధించింది.

Video Advertisement

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇది కియారా అద్వానీకి తెలుగులో మొదటి సినిమా. అయితే సినిమాలో నిడివి పెరగడం వల్ల కానీ లేదా మరే కారణాల వల్ల కానీ కొన్ని సీన్స్ కట్ చేశారు. అందులో హోలీ ఫైట్ జరిగే సీన్ ఒకటి.

story behind bharat ane nenu holi fight deleted scene

ఈ సీన్ కి సంబందించిన కొన్ని స్టిల్స్ బయటకి వచ్చాయి. దాంతో ఈ సీన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ సీన్ విడుదల చేయలేదు. ఈ సినిమాలో డిలీట్ అయిన మరి కొన్ని సీన్స్ విడుదల చేశారు. కానీ ఆ హోలీకి సంబంధించిన ఫైట్ సీన్ మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ సీన్ కి సంబంధించిన కథని ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పారు.

story behind bharat ane nenu holi fight deleted scene

హీరో తన తమ్ముడికి అప్పటికి చాలా క్లోజ్ అవుతాడు. హీరో తమ్ముడికి హోలీ ఆడాలి అని ఉంటుంది. దాంతో హీరోని హోలీ ఆడడానికి తీసుకెళ్ళమని అడుగుతాడు. హీరో తనని గుర్తుపట్టకుండా రంగులు పూసుకుని తన తమ్ముడితో పాటు హోలీ ఆడటానికి వెళ్ళినప్పుడు ఈ ఫైట్ జరుగుతుంది. ఇందులో హీరో, హీరో తమ్ముడితో పాటు హీరోయిన్ కియారా కూడా ఉంటుంది. సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ ఫైట్ మాత్రం ఇప్పటికీ విడుదల చేయలేదు.

watch video :

https://www.instagram.com/reel/CbOxV8uJ_WH/?igshid=YmMyMTA2M2Y=


End of Article

You may also like