జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది.jr ntr

అయితే ఈ ప్రోగ్రాం పేరు వెనకాల ఒక కథ ఉంది. అదేంటంటే, స్టార్ మా లో అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అదే పేరు ఉండకూడదు అని ఎవరు మీలో కోటీశ్వరుడు అని మార్చారట జెమినీ టీవీ బృందం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, “ఈ ప్రోగ్రాం కి మగవాళ్ళు మాత్రమే కాదు. ఆడవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి కోటీశ్వరుడు అని కాదు. కోటీశ్వరులు అని పెట్టండి” అని చెప్పారట. దాంతో ప్రోగ్రాం పేరు ఎవరు మీలో కోటీశ్వరులు అయ్యింది.