Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా బృందం కూడా రిస్క్ తీసుకొని విడుదల చేయలేకపోతున్నారు. ఇంక పరిస్థితి అర్థం చేసుకున్న అభిమానులు కూడా చేసేదేమి లేక సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాలో ఎత్తర జెండా పాట ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియా భట్ కూడా కనిపిస్తున్నారు. ఈ పాట ఇవాళ విడుదల అవుతుంది. అయితే ఈ పాటలో ఒక జెండాని చూపిస్తారు.
ఆ జెండాని అంతకు ముందు ట్రైలర్ లో కూడా చూపించారు. అయితే ఈ జెండా వెనక ఒక చరిత్ర ఉంది. ఈ జెండా కలకత్తా జెండా. బికాజీ కామా అనే వ్యక్తి 1907 లో ఈ జెండాని తయారు చేశారు. ఇదే మన దేశ స్వాతంత్ర జెండా. ఈ జెండాపై వందేమాతరం అని రాసి ఉంటుంది. జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో కూడా ఈ జెండాని ప్రదర్శించారు. అప్పుడు ఇదే జెండా ఉంది కాబట్టి పాటలో కూడా ఈ జెండాని చూపించారు.
End of Article