Ads
చాలామంది జంటలు తమ పెళ్లి తో పాటు ప్రీ వెడ్డింగ్ అలాగే పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్స్ లో, డిఫరెంట్ గెటప్స్ తో ఈ ఫోటో షూట్స్ చేయించుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్స్ కూడా తమదైన శైలిలో డిఫరెంట్ థీమ్స్ తో ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇలా తీయించుకున్న ఫోటోలను కొంతమంది సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు.
Video Advertisement
అయితే ఇటీవల ఒక జంట ఇలాగే డిఫరెంట్ గా ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ పాజిటివ్ గా కాదు. వివరాల్లోకి వెళితే.
బిబిసి కథనం ప్రకారం కేరళ కి చెందిన రిషి కార్తికేయన్ ఇంకా లక్ష్మి అనే జంట లాక్ డౌన్ సమయం లో సెప్టెంబర్ 16వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ప్రపంచంలో చాలా మంది జంటలు చాలా డిఫరెంట్ గా ఫొటో షూట్స్ చేయించుకుంటున్నారు. అలా ఎన్నో జంటలు తమదైన శైలిలో ఈ ఫోటో షూట్స్ ద్వారా తమ ప్రేమని ప్రపంచానికి తెలుపుతున్నారు.
రిషి కార్తికేయన్ కూడా వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా ఉండేలా ఫోటో షూట్ కాన్సెప్ట్ అనుకున్నారు. ఫోటోగ్రాఫర్ అయిన స్నేహితుడితో కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వాగామోన్ లో టీ ప్లాంటేషన్స్ లో ఈ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇందులో వాళ్ళిద్దరూ వేసుకున్న దుస్తులు, కాన్సెప్ట్ కొంచెం వేరే గా ఉండటంతో, ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై రిషి కార్తికేయన్ మాట్లాడుతూ వాళ్ళిద్దరూ మామూలుగానే డ్రెస్ చేసుకున్నామని, అవుట్ డోర్ షూట్ కాబట్టి, జాగ్రత్తగానే ఉన్నామని, ఫోటోగ్రఫీ లో క్రియేటివిటీ ఇంకా కెమెరా స్కిల్స్ ద్వారా అలా ఏస్థెటిక్ గా ఫొటోలను క్యాప్చర్ చేశారు అని అన్నారు.
లక్ష్మి మాట్లాడుతూ సాధారణంగా ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు వేసుకుంటారు అని, కేవలం మెడ, మోకాళ్లు కనిపించినంత మాత్రాన న్యూడిటీ కిందకి రాదు అని, కానీ ఫేస్ బుక్ లో ఫోటోలు పోస్ట్ చేసిన తర్వాత ఘోరంగా కామెంట్స్ చేశారు అని,
నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళలో ఆడ వాళ్లు కూడా ఉన్నారు అని, ముందు కొన్ని కామెంట్స్ కి రెస్పాండ్ అయ్యామని, కానీ తర్వాత ఫోటోలు వైరల్ అయ్యి ట్రోల్ చేయడం మొదలు పెట్టిన తర్వాత వాటిని ఇగ్నోర్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నామని అన్నారు.
కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరికి మద్దతుగా కామెంట్స్ రావడం మొదలయ్యాయి. చాలామంది ” అది వాళ్ళ ఇద్దరి ఫోటో షూట్. కాబట్టి వాళ్ళ ఇష్టం” అని, అలాగే ” ఫొటోస్ చాలా బాగున్నాయి, ట్రోల్ చేసే వాళ్ల గురించి అసలు పట్టించుకోవద్దు, సంతోషంగా ఉండండి” అని కామెంట్స్ చేశారు.
దీనిపై లక్ష్మి మాట్లాడుతూ ” నెగిటివ్ గా ఎవరు కామెంట్స్ చేస్తున్నారో మనకి తెలియదు. అలాగే ఇప్పుడు మద్దతు ఇస్తూ కామెంట్స్ ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు. కానీ ఏదేమైనా ఇలా పాజిటివ్ గా మాట్లాడటం సంతోషంగా ఉంది” అని అన్నారు.
End of Article