Home Filmy Adda “పవర్ స్టార్” కి ఆ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ? దాని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే !

“పవర్ స్టార్” కి ఆ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ? దాని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే !

by Sunku Sravan

మెగా స్టార్ తమ్ముడిగా తెలుగు సినీ ప్రజలకి పరిచయమై ఉన్నత శిఖరాలకు కి ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఫ్యాన్స్ అందరూ ప్రేమ పిలుచునే ‘పవర్ స్టార్’ టాగ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.

pawan-kalyan

pawan-kalyan

పవన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మొదటి సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని సొంతం చేసుకోలేదు. చిరంజీవి ఆ సమయం లో చేసిన ‘హిట్లర్’ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికే తమిళ్ లో వియన్ని సాధించిన గోకులత్తిల్ సీత సినిమా ఆధారంగా ముత్యాల సుబ్బయ్య కాంబో లో తెలుగు లో పవన్ తో ఈ సినిమా ని రీమేక్ చేయించారు తెలుగు లో ‘గోకులంలో సీత’ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Pawankalyan

Pawankalyan

ఈ సినిమా కి పోసాని కృష్ణ మురళి మాటలని అందించారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ ని పిలిచారు.ఇక అప్పటి నుంచి చాల పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరుకి ముందు ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్ ని జత చేస్తూ వచ్చారు. అలా పవన్ కి పవర్ స్టార్ ట్యాగ్ మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి నామకరణం చేసారు.

You may also like