Ads
పాన్ ఇండియన్ టాప్ మోస్ట్ హాట్ యాక్టర్ ఆయన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఒక బ్లాక్ షర్ట్ కారణంతో సోషల్ మీడియా లో వైరల్ అయ్యారు. అవునండి అక్షరాల ఒక షర్ట్ కారణంగా….
Video Advertisement
రీసెంట్ గా జరిగిన సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాస్ ఎంతో హుషారుగా ప్రేక్షకులను అలరించాడు.ఎప్పటికప్పుడు సినిమాల కోసం సరికొత్తగా తన బాడీలో మార్పులు చేస్తూ ఎక్స్పరిమెంటల్ హీరోగా పేరు పొందిన ప్రభాస్ ఏది చేసిన ట్రెండింగ్ గా మారుతుంది.
ఈ క్రమంలో ఆయన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేసుకొని వచ్చిన బ్లాక్ టీ షర్ట్ పై వచ్చిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆ ఈవెంట్ కి ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ పై వైట్ కలర్ లో jazz అనే అక్షరాలు ముద్రించబడి ఉన్నాయి. ఇదే తరహా చొక్కా ఐదేళ్ల క్రితం ప్రభాస్ వేసుకోవడం తో ఆ రెండు ఫోటోలను కలిపి ఇప్పుడు బాగా వైరల్ చేశారు.
ఈ ట్వీట్ పై అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు, ప్రభాస్ ఎప్పుడు హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉంటాడు కాబట్టి ఐదేళ్ల క్రితం షర్టు ఇప్పుడు కూడా వేసుకున్నాడు అని కొందరి అభిప్రాయం. అయితే మరికొందరు అలాంటి షర్ట్ నే తిరిగి కొని ఉంటాడని ,ఐదేళ్ల క్రితం షర్టు ఇప్పటివరకు ఉంటుందా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా అన్నిట్లో సెన్సేషన్ సృష్టించే ప్రభాస్ ఒక షర్ట్ తో వైరల్ అయి మళ్ళీ ఇంకో సెన్సేషన్ సృష్టించాడు.
Same t shirt #Prabhas 😍🤩
2022 2017 pic.twitter.com/K2kcRwQwuI— Salaar (@Agan_Veera) August 3, 2022
End of Article