Ads
ప్రతి కథలో ఏదో ఒక సందేశం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఆ కథ నుండి ఏం నేర్చుకున్నాడు, ఆ కథ ద్వారా ఏం తెలుసుకున్నాడు అనేది ఆ వ్యక్తి ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథ కూడా ఒకటి కాదు అనేక విషయాలను రుజువు చేస్తుంది.
Video Advertisement
ఒక దంపతులకి నాలుగేళ్ల పాప ఉంది. ఆ పాప తండ్రి ఒక బ్యాంకు ఉద్యోగి. తల్లి ఒక పెద్ద కాలేజీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది. భార్యాభర్తలిద్దరూ దాదాపు ఒకే సమయానికి ఆఫీస్ కి బయలుదేరుతారు. ఉదయాన్నే వెళ్తూ పాపని స్కూల్లో దింపేస్తారు. మళ్లీ సాయంత్రం వస్తూ వస్తూ పాపని స్కూల్ నుండి పిక్ అప్ చేసుకుంటారు.
అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అంటే పాపకి దాదాపు తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తల్లి ఒక రోజు పాప దగ్గరికి వచ్చి తను ఆడుకోవడానికి తమ్ముడు/ చెల్లెలు రాబోతున్నారు అని చెప్పింది. పాప చాలా సంతోషించింది. రోజు తన తల్లి దగ్గర కూర్చొని కడుపులో ఉన్న బిడ్డ తో మాట్లాడేది.
డెలివరీ డేట్ వచ్చింది. పాప తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెలివరీ అయింది. డాక్టర్ బయటికి వచ్చి మగ బిడ్డ పుట్టాడు అని, కానీ బాబు ఏడవటం లేదు అని, కానీ గుండె కొట్టుకుంటోంది అని పాప తండ్రితో చెప్పారు. పక్కనే ఉన్న పాప ఇదంతా విన్నది.
తల్లి పక్కనే పడుకోబెట్టిన బాబు దగ్గరికి వెళ్లి “లే తమ్ముడు” అని అనడం మొదలు పెట్టింది. అంతకుముందు తన తమ్ముడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడేదో ఇప్పుడు కూడా అలానే మాట్లాడింది.
ఇదంతా చూస్తున్న తల్లికి, తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్లు కూడా బాధ లో ఉన్నారు కాబట్టి దేనికి పెద్దగా స్పందించలేకపోయారు. పాప అలా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా బాబు లేచి ఏడవడం మొదలు పెట్టాడు. ఇది చూసిన తల్లి తండ్రి కూడా ఆనందించారు.
ఈ కథ చదివితే మీకేదో సినిమా కథ లాగా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఆ పాప నుండి మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమ అనేది ఒక మనిషికి ప్రాణం కూడా పోస్తుంది.
మరొకటి ఏంటంటే తన తమ్ముడు చాలాసేపు స్పందించకపోయినా కూడా, తన తల్లిదండ్రులు తనకు మద్దతు ఇవ్వకపోయినా కూడా, ఆ పాప పట్టువదలకుండా ప్రయత్నించింది.
కాబట్టి ఏదైనా సరే కావాలి అనుకుంటే మధ్యలో ఎన్ని ఆటంకాలొచ్చినా కూడా పట్టు వదలకుండా నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మనసుపెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ.
End of Article