ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.

jabardast naresh

ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. 350 ఎపిసోడ్ లకు సంబంధించిన సెలబ్రేషన్స్ ఈ ఎపిసోడ్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్ల నిజజీవితంలో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఇదే విధంగా జబర్దస్త్ నరేష్ కథని కూడా మనకి స్కిట్ రూపంలో చూపించారు. ఇందులో నరేష్ ని తన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం వంటివి చేశారు.jabardast naresh

దాంతో నరేష్, “ఇలా ఉండడమే నా తప్పా? నేను వేసే జోకులకు నవ్వుతారు. కానీ లోపాన్ని ఎందుకు ఎత్తి చూపిస్తారు?” అని బాధపడ్డారు. నరేష్ మాటల్ని విన్న జడ్జ్ రోజా గారు, అలాగే యాంకర్ రష్మి కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఇదే విధంగా శ్రీను, సుధీర్ ఎదుర్కొన్న కష్టాలను కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ లో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

watch video :

To watch the video, please click on “WATCH ON YOUTUBE”