టీచర్ కి “స్టూడెంట్” తో బ్రేకప్… ఆమెకి మరొకరితో పెళ్లి..? అతను ఏం చేసాడంటే..?

టీచర్ కి “స్టూడెంట్” తో బ్రేకప్… ఆమెకి మరొకరితో పెళ్లి..? అతను ఏం చేసాడంటే..?

by Megha Varna

Ads

చాలా సినిమాల్లో మనం టీచర్ తో విద్యార్థి ప్రేమలో పడటం వంటివి చూసే ఉంటాం. అలాంటి సంఘటన తమిళనాడు లోని చోటు చేసుకుంది. అది ఇప్పుడు సంచలనంగా మారింది. టీచర్ తో ఒక విద్యార్థి ప్రేమలో పడ్డాడు ఆ తర్వాత టీచర్ మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడు.

Video Advertisement

వివరాలను చూస్తే.. టీవీ9 తెలుగు కథనం ప్రకారం, చెన్నై లోని అంబత్తూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌ అనే ఒక అబ్బాయి పన్నెండవ తరగతి చదువుతున్నాడు. మే లో స్కూలింగ్ పూర్తయింది ఈ విద్యార్థికి. ఇటీవల తన ఇంట్లో బెడ్ రూమ్ లో ఉరేసుకుని మరణించాడు కృష్ణ కుమార్.

దీనితో తల్లిదండ్రులు వారి కుమారుని మరణం పై పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ జరపగా.. కృష్ణ కుమార్ చదివిన స్కూలు టీచర్ తో ప్రేమలో పడ్డాడని తెలిసింది. టీచర్ షర్మిళ, కృష్ణకుమార్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందట. కానీ టీచర్ షర్మిళ కి మరొక వ్యక్తి తో పెళ్లి కుదిరింది.

ఆమె అప్పటి నుండి కృష్ణ కుమార్‌కు దూరంగా ఉంది. పైగా కృష్ణ కుమార్ తో మాట్లాడడం కూడా మానేసిందట. దీనితో తీవ్ర మనస్థాపానికి గురై కృష్ణకుమార్‌ తన ఇంట్లో బెడ్ రూమ్ లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే కృష్ణ కుమార్‌ సెల్‌ ఫోన్‌ లో టీచర్‌ తో మాట్లాడిన వాయిస్‌ మెసేజులు, రికార్డులు ఆధారంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు. పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఆమెని జైలుకి తీసుకెళ్లారు.

ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. టీచర్ షర్మిళ, కృష్ణ కుమార్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడవడం, ఆ తరవాత ఆమెకి మరొకరితో పెళ్ళి కుదరడం.. దీనితో కృష్ణ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురై కృష్ణ కుమార్‌ తన ఇంట్లో బెడ్ రూమ్ లో ఉరేసుకుని చనిపోవడం ఇదంతా సంచలనంగా మారింది.


End of Article

You may also like