“నీ ఫేవరెట్‌ సబ్జెక్ట్‌ ఏంటి” అని అడిగితే… ఈ పిల్లడు ఇచ్చిన సమాధానాంకి నవ్వాపుకోలేరు.!

“నీ ఫేవరెట్‌ సబ్జెక్ట్‌ ఏంటి” అని అడిగితే… ఈ పిల్లడు ఇచ్చిన సమాధానాంకి నవ్వాపుకోలేరు.!

by Mohana Priya

Ads

ఈ కాలంలో ఏది వైరల్ అవ్వాలన్నా సోషల్ మీడియాతో చిటికెలో పని. గల్లీ టూ ఢిల్లీ దాకా ఏమి జరిగినా చిటికెలో తెలిసిపోతుంది. అంతే కాదు ఏదైనా మ్యాటర్ జరిగితే ఒక్క క్షణం లో వొందల, వేల మందికి ఫార్వర్డ్ అయిపోతుంది. ప్రపంచ నలుమూలల చోటు చేసుకున్న ఎలాంటి సంఘటన అయినా ఇట్టే వైరల్ అవుతోంది. వేరే దేశాలకు కానీ, రాష్ట్రాలకు కానీ వెళ్ళడం అనేది రోజుల్లో, నెలల్లో జరిగే పని. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా కేవలం కొన్ని నిమిషాలు లేదా గంటలతో పని అయిపోతుంది.

Video Advertisement

ఒకప్పుడు ఏదైనా తెలియాలి అంటే ఎక్కువ సమయం పట్టడమే కాదు. అది నిజమా కాదా అనేది కూడా ఒక సందేహంగా మారింది. కానీ ఇప్పుడు ఏదైనా సరే వొంద రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బహిర్గతం అవుతోంది. ఈ సోషల్ మీడియాలో ద్వారా ఎంతో మంది తమ సొంతంగా వినూత్న కంటెంట్లతో, విభిన్న రకాల వీడియోలు ఎన్నో చేస్తుంటారు. అందులో కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ అయితే మరికొన్ని విమర్శలపాలవుతాయి. ఈ నేపథ్యంలో బీహార్ లోని ఓ బుడతడు ఒక రిపోర్టర్ కి జవాబు ఇచ్చిన వీడియో వైరల్ అవ్వడమే కాకుండా, అందరినీ నవ్విస్తోంది.

అయితే బీహార్ కు చెందిన ఒక రిపోర్టర్ కొందరి పిల్లల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వారితో కలిసి మాట్లాడారు. అలా కొన్ని ప్రశ్నలు వెయ్యగా, ఆరవ తరగతి పిల్లాడి జవాబులకు రిపోర్టర్ కంగు తిన్నాడు. అడిగిన ప్రశ్నలను పూర్తిగా వినకుండానే సమాధానాలు వింకర టింకరగా చెప్పాడు. ముందుగా నీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం అని రిపోర్టర్ అడిగినప్పుడు, ప్రశ్న, పూర్తిగా వినక ముందే వంకాయ కూర అని చెప్పాడట. దీంతో రిపోర్టర్ కి నవ్వు వచ్చినా ఆపుకుంటూ… కూర కాదు సబ్జెక్ట్ ఏది ఇష్టం అని అడిగితే… ఓహ్ సారీ ఇట్స్ ఇంగ్లీష్ అని చెప్పాడట. ఆ భాషలో ఏదైనా పద్యం చెప్పమంటే 55 నుంచి 100 వరకు స్పెల్లింగ్ వచ్చని చెప్పాడు. సరే అని మరో ప్రశ్న వేశాడు ఆ రిపోర్టర్.

మరి దేశ ప్రధాని ఎవరో తెలుసా అని ప్రశ్నించగా… చమత్కారంగా నితీష్ కుమార్, తర్వాత లాలూ యాదవ్ అని జవాబు ఇచ్చాడు. దీంతో విసిగిపోయిన రిపోర్టర్, దేశ ప్రధాని అని నొక్కి చెప్పు అడిగితే… మోదీ, మోదీ సర్కార్ అంటూ గట్టిగ అరుస్తూ సమాధానం ఇచ్చాడట. ఇక ఈ వీడియోని ఆ బీహార్ రిపోర్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో… బాగా వైరల్ అయ్యి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు నెటిజన్లు, వీక్షకులు అయితే ఆ చిన్న పిల్లాడి తెలిసీ, తెలియని వయసులో మాట్లాడిన చామతార్కపు మాటలు అందరికీ నవ్వు తెప్పించాయి.ఏదేమైనప్పటికీ, అతను వయసులో తొలుత సరైన జవాబులు ఇవ్వక పోయినా, తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాడు. అందులో అతను పలికి పేర్లను బట్టీ చూస్తే, చుట్టూ జరుగుతున్న సంఘటనలు చిన్న పిల్లల మెదడులో బాగానే నాటుకు పోతున్నట్లు కూడా అర్థమవుతోంది..

watch video:

https://www.instagram.com/reel/Cg1nNS2LqYT/

Source:- https://www.sakshi.com/telugu-news/national/viral-video-reporter-asks-boy-favourite-subject-name-pm-answers-just-hilarious

 


End of Article

You may also like