ఇంటిపైకెక్కి క్లాసులు వింటున్న స్టూడెంట్…వైరల్ అవుతున్న ఫోటో వెనకున్న కథ ఇదే.!

ఇంటిపైకెక్కి క్లాసులు వింటున్న స్టూడెంట్…వైరల్ అవుతున్న ఫోటో వెనకున్న కథ ఇదే.!

by Megha Varna

Ads

కరోనా విజృంభణ ప్రారంభానికి ముందే స్కూళ్లకి సెలవులు ప్రకటించి మంచి పని చేశాయి ప్రభుత్వాలు..లేదంటే కరోనా టార్గెట్ చిన్నపిల్లలే కాబట్టి పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది..తర్వాత లాక్ డౌన్ ప్రకటించడంతో స్కూళ్లు మూసివేసి సుమారు మూన్నెళ్లు కావొస్తుంది..ఈ నేపధ్యంలో  పాఠశాలలు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తుండడంతో వాటిని అటెండ్ అవ్వడానికి విద్యార్దులు నానాపాట్లు పడుతున్నారు.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఒక ఫోటో విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతోంది..ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావాలంటే స్మార్ట్ ఫోన్,  నెట్ స్పీడ్ ముఖ్యం..అందరి విద్యార్దులకు అందుబాటులో ఉంటాయని చెప్పలేము.. ఎవరి ఇబ్బందులు వాళ్లవి…క్లాసులకు అటెండ్ కావల్సిందే అనేది స్కూల్ యాజమాన్యాల ధోరణి..తాజాగా ఒక విద్యార్ధిని ఫోన్లో నెట్ రాకపోవడంతో ఏకంగా ఇల్లు పైకి ఎక్కి కూర్చుని ఆన్లైన్ క్లాసులు వింటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది..ఆ విద్యార్ధిని కేరళకు చెందిన నమితా నారాయణన్ అని సమాచారం..

Video Advertisement

కేరళ మలప్పురంలోని అరీక్కల్‌కు చెందిన నమితా నారాయణన్‌  బీఏ ఇంగ్లీష్ చదువుతోంది. ఆమె చదువుతున్న కాలేజీ వారు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు పెట్టడంతో వాటిని వినడం కోసం ఇంట్లోని పలు ప్రదేశాల్లో కూర్చొని వాటిని అటెండ్ అవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఎక్కడా సిగ్నల్ రాకపోవడంతో ఇంటిపైకి ఎక్కింది.. సిగ్నల్ వచ్చింది.. అక్కడే కూర్చుని క్లాసులు వినాలనుకుంది..ఎండలు మండిపోతుండడంతో ఒక గొడుగు సాయంగా వాడుకుంది.

representative image

ఆమె ఇంటిపైన కూర్చుని క్లాసులు వింటున్న టైంలోనే అటువైపు వెళ్లిన ఒక వ్యక్తి నమిత ఫొటోని తీసి సోషల్ మీడియాలో శేర్ చేశాడు.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోని చూసిన నెటిజన్లు.. చదువు కోసం నమిత పడుతున్న కష్టాలను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..మరో వైపు ఈ విషయం  ఒక మొబైల్ నెట్ వర్క్ సంస్థ వరకు వెళ్లడంతో ..వాళ్లు నమిత ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ని ఇచ్చారు..

representative image

ఇది కేవలం నమిత సమస్య మాత్రమే కాదు.. ఇంటర్నెట్ మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్ లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు..అలాంటి వాళ్లు కొందరు తెలిసిన వాళ్లని క్లాస్ వినడం కోసం స్మార్ట్ ఫోన్ ని కాసేపటికి అప్పుగా అడుగుతుంటే ఆ సౌకర్యం లేని వారు కూడా క్లాసులకు దూరం అవుతున్నారు..అనేక సమస్యలు ఉండడంతో ఆన్లైన్ విద్యపట్ల వ్యతిరేకత వస్తుంది..చూడాలి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందో..


End of Article

You may also like