మరుజన్మ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు.? అని టీచర్ అడిగితే…స్టూడెంట్స్ ఏమన్నారో తెలుసా? చివరికి టీచర్.!

మరుజన్మ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు.? అని టీచర్ అడిగితే…స్టూడెంట్స్ ఏమన్నారో తెలుసా? చివరికి టీచర్.!

by Sainath Gopi

Ads

ఒక టీచర్ తన విద్యార్థులను సరదాగా ఇలా ప్రశ్నించారు.మీకు మరుజన్మ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? ఒకొక్కరుగా చెప్పండి చూద్దాం అన్నారు టీచర్… పిల్లలు ఇలా చెప్పసాగారు.

Video Advertisement

“టీచర్ నేను రోజా పువ్వులా పుట్టాలనుకుంటున్నాను.” అని ఒక విద్యార్థి అంటే…ఎందుకలా? అని టీచర్ ప్రశ్నించారు. అందంగా, ఉండి అందరిచే ఇష్టపడతాను కాబట్టి అని ఆ విద్యార్థి సమాధానం ఇచ్చారు. వెరీ గుడ్…తర్వాత…అని టీచర్ అన్నారు.

టీచర్ నేనేమో నెమళి లా పుడతాను. అని ఒక విద్యార్థి అంటే…ఎందుకలా? అని టీచర్ ప్రశ్నించారు. నాకు నెమలి నాట్యం అంటే నాకు ఇష్టం కాబట్టి అని ఆ విద్యార్థి సమాధానం ఇచ్చారు. ఓహో…తర్వాత….అని టీచర్ అన్నారు.

నేను జింకలా పుడతాను. హాయిగా గెంతుతూ పరుగెత్తవచ్చు అని మరొక విద్యార్థి సమాధానం ఇచ్చాడు. నేను సీతాకోకచిలుక లా పుడతాను.. ఎన్ని రంగులో…రంగులంటే నాకిష్టం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు అని ఇంకో విద్యార్థి సమాధానం ఇచ్చారు. వామ్మో….తర్వాత….

నేను చెట్టులా పుడతాను.. ఎన్నో పక్షులు వచ్చి నాపై వాలుతాయి… పక్షులంటే ఇష్టం. గుడ్…తరువాత…నేను రవీంద్రనాథ్ ఠాగూర్ లా పుడతాను.. కవితలంటే ఇష్టం నాకు.బెస్ట్….తర్వాత…నేను రామచిలుక లా…ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి… థాంక్స్ …ఇంకా ఎవరు లేరా?

మీరు కూడా చెప్పండి టీచర్ అన్నారు పిల్లలు.. టీచర్ నవ్వుతూ ఇలా చెప్పారు. నేను చాక్ పీస్ లా పుడతాను అన్నారు. పిల్లలంతా ఒక్కటే నవ్వు…చాక్ పీస్ ఆ ఆ ఆ…అవును, పిల్లలూ. ఎందుకంటే నల్లని బల్ల వల్ల మీరు ఏమి నేర్చుకోలేరు…మీకు ఒక్క అక్షరం నేర్పడానికి అది అరిగి పోతూ… మీకు భవిష్యత్తు ను ఇస్తుంది…అందుకే దాని గొప్పతనం టీచర్ గా నాకు బాగా తెలుసు కాబట్టి అలా చెప్పాను…అన్నారు టీచర్. పిల్లలంతా క్షణం ఆగి చప్పట్లు కొట్టారు…వాళ్ళల్లో ఒక చిన్నారి’ అయితే నేను చిన్న చాక్ పీస్ లా పుడతాను” అని అంది…

వెంటనే మిగతా పిల్లలు కూడా ” మేము కూడా చిన్న చాక్ పీస్ లానే పుట్టి అందరికీ కొన్నైనా నేర్పుతాము టీచర్” అని ముక్త కంఠం తో అన్నారు. పిల్లల భవిష్యత్తు ను తీర్చి దిద్దే ప్రతి టీచర్ కు ఈ చిన్ని కధ అంకితం…ఆచార్య దేవోభవ.

source: social media forward message


End of Article

You may also like