Ads
సాధారణంగా విద్యార్థులు తమ గురువులకు ఫీజ్ ఇవ్వడం,వెనకాల వాళ్ళ పైన సెటైర్ లు వేయడం చేస్తుంటారు. కాని కొందరు విద్యార్థులు కష్టాలలో ఉన్న వాళ్ళ గురువుకు గురదక్షిణ ఇచ్చారు.అది చూసినవారంతా షాక్ అవుతున్నారు.అదేంటో మీరు కూడా ఓ లుక్ వేయండి.
Video Advertisement
రుద్రంగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లము, జీవశాస్త్రం పాఠాలు నేర్పే 52 ఏళ్ల హనుమంతుల రఘు కరోనా కారణంగా ఆయన టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయారు. కొడుకు కూడా నిరుద్యోగి కావడంతో ఆ కుటుంబం పూర్తి ఆర్థిక కష్టాలలో కూరుకుపోయింది.గురువు కష్టాలలో ఉన్నారని విషయం తెలుసుకున్న శిష్యులు అక్కడ ఉన్న స్థలంలో గురువుకు టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు..ఆ షాప్ వద్దకు కస్టమర్స్ ను కూడా తీసుకొస్తానని తన శిష్యులు చెప్పారని ఆ గురువు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తన శిష్యులు ఇచ్చిన ఆ టిఫిన్ సెంటర్ కు ఆ గురువు గురుదక్షిణ అని పేరు పెట్టారు.ఈ గురు,శిష్యుల బంధాన్ని చూసిన వారంతా వీరి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
End of Article