ఎప్పుడో అనుకున్న కల 65 ఏళ్ళకి నిజమయింది. 35 ఏళ్ల వారి ప్రేమ కథకు మూడు ముళ్ళు పడ్డాయి. ఇక వివరాల్లోకి వెళితే.. కర్ణాటక హెబ్బాళ్ కి చెందిన చిక్కున్న అనే వ్యక్తికి 65 సంవత్సరాలు. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తను పక్కింటి అమ్మాయి విజయమ్మను ప్రేమించాడు. కానీ దురదృష్టవశాత్తూ అతను ఆమెని పెళ్లి చేసుకోలేకపోయాడు.

Video Advertisement

ఆమె పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని మరొకరిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన కొద్ది కాలానికే అతను చనిపోయాడు. వారికి పిల్లలు కూడా లేరు. అప్పటినుండి ఒంటరిగా జీవితాన్ని సాగిస్తోంది. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అని చిక్కన్న కూడా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ప్రేమ విఫలం అయిందని జీవితాంతం పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాడు.

ఈ మధ్య తాను ప్రేమించిన జయమ్మ ఒంటరిగా ఉందని తెలిసి ఆవేదన చెందాడు. మరోసారి తన ప్రేమ గురించి ఆమెకి చెప్పాలని అనుకున్నాడు. తనకోసమే ఇన్నాళ్లు ఒంటరిగా ఉండి పోయాడు అని తెలుసుకున్న జయమ్మ మనసు కరిగింది. ఇలా ఇద్దరూ ఆఖరికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

బంధువుల సమక్షంలో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఎవరికి ఎవరు అనేది ముందే రాసిపెట్టి ఉంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.