సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి అప్డేట్ ని నెటిజెన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో మహేష్ బాబు ఖాతాలు ఉన్నాయి. అయితే ఇవాళ మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అనుకోకుండా ఒక మార్పు కనిపించింది.  అది ఏంటంటే, మహేష్ బాబు పోస్ట్స్ కింద కామెంట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి.

7 mahesh babu

కామెంట్స్ ఆన్ చేసి ఉన్న పోస్ట్ లకి కూడా కేవలం లిమిటెడ్ కామెంట్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంది. మహేష్ బాబు సాధారణంగా ఎప్పుడూ ఇలా చేయరు. అయితే ఇవాళ ఇలా ఉండడం నెటిజన్లని కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. మరొక విషయం ఏంటంటే నమ్రత శిరోద్కర్ అకౌంట్ కూడా ఇలాగే ఉంది. అంతే కాకుండా గౌతమ్, సితార అకౌంట్స్ కి కూడా లిమిటెడ్ కామెంట్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంది. ఇలా ఉండటానికి గల కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.