ఆ మాటతో ఇంకో మెట్టు ఎక్కేసావ్ సుధీర్ భయ్యా…అందుకే నీకు ఫాన్స్ ఎక్కువ.!

ఆ మాటతో ఇంకో మెట్టు ఎక్కేసావ్ సుధీర్ భయ్యా…అందుకే నీకు ఫాన్స్ ఎక్కువ.!

by Sainath Gopi

Ads

జబర్దస్త్ షో తో పాపులర్ అయిన వ్యక్తులు చాలామందే ఉన్నారు .అందులో సుడిగాలి సుధీర్ ముందు  వరసలో ఉంటారు. రష్మీ ,సుడిగాలి సుధీర్ కలిసి చేసే ఫన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. జబర్దస్త్ కాకుండా ఇంకా చాలా షోస్ చేసి మెప్పించారు సుడిగాలి సుధీర్.

Video Advertisement

ఇటీవల సుడిగాలి సుధీర్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో తన ఫాలోవర్స్ తో మాట్లాడారు. అందులో ఒక ఫాలోవర్ “స్కిట్స్ లో మిమ్మల్ని అందరూ తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతారు? మీరు అలా మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు?” అని అడిగారు.

దానికి సుధీర్ అలా తను ఎప్పుడూ అనుకోలేదు అని, ఏది చేసినా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తాను అని, ఒకవేళ తనని పొగిడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అంటే పొగడమంటాను అని, ఒకవేళ తన పై సెటైర్లు వేస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే సెటైర్లు వేయమంటాను అని,

ఏది చేసినా జనాలని నవ్వించడం కోసం మాత్రమే అని, తమకి వ్యక్తిగత సమస్యలు ఏమీ లేవు అని, తన గోల్ ఆడియన్స్ ని నవ్వించడం అని,  కాబట్టి ఏం చేసినా ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే చేస్తామని చెప్పారు సుధీర్.

watch video:

https://www.youtube.com/watch?v=C5mL6NtujpM&authuser=0

 

సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

#1 ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్  మాత్రం హీరో పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని.

#2 సుడిగాలి సుధీర్  సిద్దార్థ డిగ్రీ కాలేజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు .

#3 సుధీర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు చూడగానే సుడిగాలి సుధీర్ అంటూ పలకరించారు. ఈ సంఘటన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని ఎప్పుడూ జబర్దస్త్ కు రుణపడి ఉంటానని సుడిగాలి సుధీర్ కొన్నిసార్లు వెల్లడించారు .

 

#4 బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ కు మరియు టాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు సుడిగాలి సుధీర్ సహాయ దర్శకునిగా పనిచేసారు.

#5 పోవే పోరా,జాక్ పాట్ లాంటి చాలా షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు సుడిగాలి సుధీర్. ఢీ సీజన్ 9, 10, 11 తో పాటు ఇప్పుడు వస్తున్న ఢీ ఛాంపియన్స్ లో కూడా ఒక టీం కి టీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు.

#6 సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కు రాకముందు డబ్బులు సంపాదించడానికి మేజిక్ లు చేసేవారు. మొదటగా మేజిక్ ను తన మావయ్య దగ్గర నేర్చుకున్నారు సుధీర్ . కాగా  5 వ తరగతిలో తాను చేసిన మేజిక్ కు మొదట సంపాదన వచ్చింది సుధీర్ కు.

#7 సుధీర్ తల్లి గారికి సుధీర్ ను ఒకసారి స్క్రీన్ మీద చూడాలని కోరిక ఉండేది. సుధీర్ కు కూడా ఇటువంటి కోరిక ఉండడంతో చిత్ర పరిశ్రమకు వచ్చారు.

#8 మేజిక్ లు చేస్తూ స్టేజి షోస్ ఇస్తున్న సమయంలో గెటప్ శ్రీను పరిచయం అయ్యారు సుధీర్ కు. అతని ద్వారా వేణు పరిచయం అవ్వడంతో మొదటగా జబర్దస్త్ లో సుధీర్ కు అవకాశం వచ్చింది .

#9 ఒక స్క్రిప్ట్ నిమిత్తం వేణు ద్వారా సుధీర్ కార్తీక్ రెడ్డి అనే దర్శకుడి దగ్గరకి వెళ్ళాడు ఆ నేపథ్యంలో సుధీర్ కు మొదటిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రమే “అడ్డా “. ఈ చిత్రంతో సుధీర్ కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది .

#10 రేస్ గుర్రం ,టైగర్ ,సుప్రీమ్ ,సర్ధార్ గబ్బర్ సింగ్,బ్రదర్ అఫ్ బొమ్మాళి లాంటి పలు చిత్రాలలో సహాయ పాత్రలలో నటించారు సుడిగాలి సుధీర్. అలాగే త్రీ మంకీస్, సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాల్లో లీడ్ రోల్ లో చేశారు.


End of Article

You may also like